రాష్ట్రీయం

నాగార్జున వర్సిటీలో ర్యాగింగ్ కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జున యూనివర్సిటీ, సెప్టెంబర్ 9: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం జరిగిన ర్యాగింగ్ ఘటన సంచలనం రేకెత్తించింది. ఇంజనీరింగ్ కళాశాలలో ఇసిఇ విభాగానికి చెందిన కొందరు సీనియర్లు తనను ర్యాగింగ్ చేశారని అదే కళాశాల సివిల్స్ విభాగం జూనియర్ విద్యార్థి పోలీసులు, వర్సిటీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. వర్సిటీ ఉన్నతాధికారులు విచారణ జరిపిన అనంతరం ర్యాగింగ్‌కు పాల్పడిన ఐదుగురు విద్యార్థులను హాస్టళ్ల నుండి శాశ్వతంగా, కళాశాల నుండి తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేసు విచారణ అనంతరం విద్యార్థులపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తామని, ర్యాగింగ్‌కు పాల్పడి వుంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.