తెలంగాణ

సింగరేణిలో బిసి రూల్ ఆఫ్ రిజర్వేషన్‌పై శాసనసభ బిసి సంక్షేమ కమిటీ సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, సెప్టెంబర్ 9: సింగరేణి సంస్థలో బిసిలకు అమలు జరుగుతున్న రూల్ ఆఫ్ రిజర్వేషన్‌పై ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని సింగరేణి అతిథిగృహంలో శుక్రవారం తెలంగాణ శాసనసభ బిసి సంక్షేమ కమిటీ సమీక్ష నిర్వహించింది. ఈసందర్భంగా సింగరేణి అధికారులు సంస్థ డైరెక్టర్ (పా అండ్ పిపి) ఎ మనోహరరావు నేతృత్వంలో సంస్థ పుట్టు పూర్వోత్తరాలు, బొగ్గు ఉత్పత్తి విధానం, ఆధునికీకరణ పనులు, తదితర అంశాలతో పాటు సంస్థలో రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను అమలు చేస్తున్న తీరును పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. సంస్థలో 57 వేల 838 మంది పనిచేస్తుండగా 30, 663 మంది కార్మికులు వెనుకబడిన తరగతుల (బిసి) వారే ఉన్నారని తెలిపారు. మొత్తం 53.07 శాతం మంది బిసి కార్మికులు, ఉద్యోగులు ఉన్నారని కమిటీకి గణాంకాలతో సహా వివరించారు. త్వరలో భర్తీ చేయనున్న ఉద్యోగ నియామకాల్లో కూడా సక్రమంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను పాటించాలని కమిటీ చైర్మన్ గంగాధర్ గౌడ్ అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో ఖమ్మం ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు, కమిటీ సభ్యులు, ఇతర సింగరేణి అధికారులు పాల్గొన్నారు.