రాష్ట్రీయం

మహారాష్టక్రు భగీరథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 10: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథపై మహారాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. ప్రాజెక్టు స్వరూపం, పనులు జరుగుతున్న తీరు తెలుసుకునేందుకు మహారాష్ట్ర తాగునీటి మంత్రి బాబన్‌రావ్ లోనికర్ నాయకత్వంలో మహారాష్ట్ర ఇంజనీర్ల బృందం శనివారం రాష్ట్రానికి వచ్చింది. దేశంలోని పలు రాష్ట్రాలు ఇప్పటికే మిషన్ భగీరథపై ఆసక్తి చూపుతున్నాయి. బీహార్, బెంగాల్ రాష్ట్రాల్లో పథకం అమలు విషయాన్ని పరిశీలిస్తామని గతంలో ఆయా రాష్ట్రాలు ప్రకటించాయి. హైదరాబాద్‌కు వచ్చిన మహారాష్ట్ర బృందం తెలంగాణ అధికారులతో సమావేశమై ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. తీవ్రమైన నీటి ఎద్దడితో ఇబ్బంది పడుతోన్న మరఠ్వాడకు మిషన్ భగీరథ వంటి పథకం అవసరమని మహారాష్ట్ర తాగునీటి సరఫరా మంత్రి బాబాన్‌రావ్ లోనికర్ అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర బృందం రెండు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించి పథకం అమలు తీరును పరిశీలిస్తుంది. ఆదివారంనాడు మహారాష్ట్ర బృందం మెదక్, నిజామాబాద్, నియోజకవర్గాల్లో పర్యటించి మిషన్ భగీరథ పనులు పరిశీలిస్తుంది. కాంటూర్ లెవల్స్ ఆధారంగా ప్రాజెక్టును డిజైన్ చేశామని, 90శాతం నీటిసరఫరా గ్రావిటీతోనే జరుగుతుందని, దీనివల్ల విద్యుత్ ఖర్చు తక్కువగా ఉంటుందని అధికారులు మహారాష్ట్ర బృందానికి వివరించారు. ప్రతిష్టాత్మకమైన పథకానికి నిధుల కొరత లేకుండా ముఖ్యమంత్రి తీసుకుంటున్న చర్యలనూ మహారాష్ట్ర బృందం అడిగి తెలుసుకుంది. మరాఠ్వాడ ప్రాంతంలో ఇలాంటి పథకం ప్రారంభించాలనే ఆలోచనతో తెలంగాణ పర్యటనకు వచ్చినట్టు మంత్రి బాబన్‌రావ్ వెల్లడించారు. ఇంత తక్కువ సమయంలో అటవీ, రైల్వే, జాతీయ రహదారుల నుంచి అనుమతులు పొందడం సామాన్యమైన విషయం కాదని మంత్రి బాబాన్ అభిప్రాయపడుతూ, పథకం తీరుతెన్నుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లోని హోటల్ ప్లాజాలో మిషన్ భగీరథ ఇంజనీర్లు, అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. మహా బృందానికి ప్రాజెక్టుపై అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇంటింటికి నల్లా నీళ్లిచ్చే కార్యక్రమం చేపట్టారని, ఆ స్ఫూర్తితోనే రాష్టవ్య్రాప్తంగా ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు మిషన్ భగీరథ ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్టు మహారాష్ట్ర బృందానికి తెలంగాణ అధికారులు వివరించారు. వచ్చే ఎన్నికల నాటికి ప్రతి ఇంటికి నల్లా నీళ్లు అందించాలని నిర్ణయించగా, అంతకంటే ముందే ఇంటింటికి మంచినీటిని అందించే ప్రాజెక్టు పూర్తవుతుందని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో పనులు పూర్తి కావడంతో ఇటీవల ప్రధాని మోదీ ఈ పథకాన్ని ప్రారంభించినట్టు వివరించారు. గజ్వేల్‌లో పథకం పూరె్తైందని, త్వరలోనే పలు నియోజక వర్గాల్లో ఇంటింటికి తాగునీరు అందించనున్నట్టు చెప్పారు. డిసెంబర్ 2017నాటికి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మంచినీటిని అందించే విధంగా పథకం పనులు చురగ్గా సాగుతున్నాయని అధికారులు మహారాష్ట్ర బృందానికి వివరించారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు చేపట్టిన పనులు వివరించారు. పైప్‌లైన్ల నిర్మాణం, నీటి వసతి గురించి వివరాలు అందించారు. మంచినీటితో పాటు ఇంటింటికి ఇంటర్‌నెట్ కనెక్షన్ అందించేందుకు చేస్తోన్న ప్రయత్నాలను వివరించారు. ఇంటింటికి మంచినీటితో పాటు ఇంటర్‌నెట్ అందించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించనుందని మహారాష్ట్ర బృందానికి అధికారులు వివరించారు.

చిత్రం.. ప్రతిష్ఠాత్మక మిషన్ భగీరథ పథకం వివరాలు తెలుసుకోవడానికి వచ్చిన మహారాష్ట్ర మంత్రి బాబన్‌రావ్‌కు స్వాగతం పలుకుతున్న అధికారులు