రాష్ట్రీయం

నరుూం కేసులో కీలక మార్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 12: గ్యాంగ్‌స్టర్ నరుూం కేసు విచారణ వేగవంతమైంది. సిట్ అధికారులు చేపడుతున్న ఈ కేసును మరింత బలోపేతం చేసే దిశగా కీలక మార్పు చోటుచేసుకుంది. సిట్‌ను విస్తరిస్తూ తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేసేందుకు మరో ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో నరుూం అతని గ్యాంగ్‌పై కేసులు ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్న దృష్ట్యా సిట్ బృందంలో మరో ఐదుగురు ఉన్నతాధికారులను నియమించారు. కరీంనగర్ ఓఎస్‌డి ఐపిఎస్ అధికారిణి ప్రియదర్శిని, అదనపు డిసిపి ఇస్మాయిల్, ఖమ్మం అదనపు ఎస్పీ సాయిరెడ్డి, గోషామహల్ ట్రాఫిక్ ఏసిపి జైపాల్, నార్సింగ్ సిఐ రామచందర్‌రావును నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా ఈ కేసులో వివిధ ప్రభుత్వ విభాగాలతో సమన్వయ బాధ్యతను అదనపు డిజిపి అంజనీకుమార్‌కు అప్పగించారు. గ్యాంగ్‌స్టర్ నరుూం, అతని అనుచరులపై ఇప్పటి వరకు 72 కేసులు నమోదు కాగా 80 మందిని అరెస్టు చేసినట్టు సిట్ చీఫ్ నాగిరెడ్డి తెలిపారు. భూదందాల్లో నరుూంతో సంబంధాలున్న అతని అనుచరుల కోసం ఇంకా వేట కొనసాగుతోందని, నరుూం బాధితులు ఇంకా ఎవరున్నా నిర్భయంగా ఆయా పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేసుకోవచ్చని సిట్ చీఫ్ నాగిరెడ్డి సూచించారు.
నరుూం కేసు సిబిఐకి అప్పగించండి
గ్యాంగ్‌స్టర్ నరుూం కేసును విచారణ జరుపుతోన్న సిట్ బృందంతో బాధితులకు న్యాయం జరగదని, ఈ కేసును సిబిఐతో విచారణ జరిపించాలని కోరుతూ సోమవారం రాష్ట్ర హైకోర్టులో సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ పిల్ దాఖలు చేశారు. నరుూంపై పుంఖాను పుంఖానులుగా వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో విచారణకు సిట్ సరిపోదని, నరుూం నేర సామ్రాజ్యంలో వేలాది మంది బాధితులున్నందున ఈ కేసును సిబిఐకి అప్పజెప్పడమే సరైన మార్గమన్నారు. నరుూం హతమై 36 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇప్పటి వరకు నరుూం బంధువులు, అనుచరులను మాత్రమే అదుపులోకి తీసుకుందని, నరుూం వెనుక అసలు దోషులెవరనేది తేల్చలేక పోతుందన్నారు. సోమవారం కోర్టులో పిల్ దాఖలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నరుూం బాధితులకు న్యాయం చేయాలని నారాయణ డిమాండ్ చేశారు.