తెలంగాణ

ప్రజాప్రతినిధుల విచారణ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 13: గ్యాంగ్‌స్టర్ నరుూం అక్రమాల కేసులో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్లకు అందుతున్న ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని ఈ కేసు దర్యాప్తును సిట్ వేగవంతం చేసింది. రాష్ట్రంలో వివిధ పోలీస్ స్టేషన్లకు అందిన ఫిర్యాదులను సిట్ పరిశీలించింది. ప్రాథమిక ఆధారాలు ఉన్నందున మరో 30 కేసులను నమోదు చేయాలని సిట్ నిర్ణయించింది. వినాయక నిమజ్జనం తర్వాత ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కొందరు ప్రజాప్రతినిధులను విచారించాలని సిట్ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే సిట్ అధికారులు ఈ కేసులో ప్రజా ప్రతినిధులపై వచ్చిన అభియోగాలకు సంబంధించి లోతుగా దర్యాప్తు చేశారు. పక్కా ఆధారాలు లభించినందుకు వీరిని విచారణ నిమిత్తం ఈ నెల 15వ తేదీ తర్వాత నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో 72 కేసులు నమోదయ్యాయి. మొత్తం 80 మందిని అరెస్టు చేశారు. సిట్‌కు వచ్చిన ఫిర్యాదులపై దర్యాప్తును వేగవంతం చేసేందుకు మరో ఐదుగురు ఐపిఎస్‌లను సిట్‌లోకి తీసుకున్నారు. అదనపు డిజి అంజనీ కుమార్ సేవలను కూడా వినియోగించనున్నారు. ప్రాసిక్యూషన్ పటిష్టంగా ఉండేందుకు న్యాయకోవిదుల సలహాను వినియోగించుకోవాలని నిర్ణయించారు. మంగళవారం సిట్ అధిపతి నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఉన్నత పోలీసు అధికారులు డిజిపిని కలిశారు. ఈ సందర్భంగా డిజిపి కేసు పురోగతిని సమీక్షించారు. ఈ నెలాఖరులోపల నరుూం కేసులపై చార్జిషీటును దాఖలు చేయాలని సిట్ నిర్ణయించింది.