తెలంగాణ

రాజధానిపై కుండపోత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 14: హైదరాబాద్ నగరంలో బుధవారం రాత్రి కుండపోత కురిసింది. కొన్ని ప్రాంతాల్లో రికార్డు స్ధాయి వర్షపాతం నమోదైంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అమీర్‌పేట, ఉప్పల్, కుత్బుల్లాపూర్, తిరుమలగిరి, మల్కాజగిరి, సికింద్రాబాద్, చిక్కడపల్లి, అబిడ్స్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో రాత్రి 7 గంటల నుంచి 11 గంటల వరకు ఏకధాటిగా వర్షం కురవడంతో రోడ్లు కాల్వలను తలపిస్తున్నాయ. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించడంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడడంతో లోతట్టు ప్రాంతాల ఇండ్లలోకి నీరు చేరింది. తెలంగాణ ప్రాంతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడిందని, కోస్తాంధ్రలో గత రెండురోజుల క్రితం ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగతోందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో నైరుతీరుతుపవనాలు ఉధృతంగా ఉన్నాయన్నారు. సాధారణంగా అల్పపీడనం బంగాళాఖాతంలో ప్రారంభమై కోస్తాంధ్ర వరకు విస్తరిస్తుంది. తర్వాత బలహీనపడిపోతుంది. ఈ పర్యాయం తెలంగాణలో కూడా అల్పపీడనం నెలకొందని ఐఎండి తెలిపింది. ఈ ప్రభావం వల్ల తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయ. వచ్చే రెండురోజుల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇదిలావుంటే, రాజధానిలో గురువారం వినాయక నిమజ్జనం కార్యక్రమానికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నా, భారీ వర్షం వల్ల తీవ్ర అవాంతరాలు తలెత్తుతున్నాయి. బుధవారం రాత్రి కూడా ట్యాంక్ బండ్‌కు బయలుదేరిన గణనాథుల శోభయాత్ర తెరిపివ్వని వర్షంతో ఎక్కడికక్కడ నిలిచిపోయింది. రంగారెడ్డి జిల్లాలో కొత్తగడి వాగు వద్ద నిలిచిన వాహనాలు, రైలు పట్టాలపైకి వర్షం చేరడంతో బీదర్-హైదరాబాద్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం తప్పింది. రంగారెడ్డి జిల్లా ధారూర్ మండలం చింతపల్లి వద్ద భారీ వర్షానికి ఓ వాహనంపై వెళ్తున్న భార్య, భర్తలు కొట్టుకుపోతుండగా వీరిని గ్రామస్తులు కాపాడారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా బంటారంలోని మధువాపూర్ వాగు వద్ద ఓ ఇండికా కారు కొట్టుకుపోయింది. కారులోని ఆరుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఉప్పల్‌లో 7 సెం.మీ, బండ్లగూడలో 4.75 సెంమీ, నారాయణగూడలో 3.2 సెం.మీ, తిరుమలగిరిలో 3.1 సెం.మీ, బొలారంలో 3 సెం.మీ, మల్కాపూర్‌లో 2.9 సెం.మీ, ఫీవర్‌హాస్పిటల్‌లో 2.8 సెం.మీ, మిరాలం మండీ వద్ద 2.75 సెం.మీ వర్షపాతం రాత్రి 10 గంటలకే నమోదైంది. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లపై వాహనాలు కొట్టుకుపోయాయి. మూసీ పరివాహక ప్రాంతమంతా వరద నీటితో బురదమయమైంది. కొన్ని చోట్ల అపార్ట్‌మెంట్లలోని సెల్లార్‌లలో నీరు నిలిచిపోయింది. ఐదుగంటల పాటు ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షానికి నగరమంతా అతలాకుతలమైంది. సహాయక చర్యలు చేపట్టిన జిహెచ్‌ఎంసి అధికారులు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. రాష్టవ్య్రాప్తంగా గత ఇరవైనాలుగు గంటల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, నల్లగొండ, వరంగల్, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి తదితర జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఖానాపూర్ (ఆదిలాబాద్)లో 9 సెంటీమీటర్లు, మహేశ్వరం, పరిగి, నవాబ్‌పేట (రంగారెడ్డి), ధర్మసాగర్ (వరంగల్), లో ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.