రాష్ట్రీయం

మిషన్ భగీరథకు యూకో బ్యాంక్ 2వేల కోట్ల రుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 19: మిషన్ భగీరథ పథకం అమలుకు రెండువేల కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు యూకో బ్యాంక్ అంగీకరించింది. హైదరాబాద్‌లోని ఆర్‌డబ్ల్యుయస్ ప్రధాన కార్యాలయంలో ఇఎన్‌సి సురేందర్‌రెడ్డిని యూకో బ్యాంకు హైదరాబాద్ రీజినల్ ఆఫీస్ జనరల్ మేనేజర్ వెంకటేశ్ కలిసి రెండువేల కోట్ల రూపాయల రుణం ఇవ్వడానికి అంగీకరించారు. మహబూబ్‌నగర్ సెగ్మెంట్‌లోలో మిషన్ భగీరథ పూర్తి చేయటానికి రెండువేల కోట్ల రూపాయల రుణం యూకో బ్యాంక్ ఇస్తుంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు డిసెంబర్ 2017 నాటికి రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి మంచినీటిని అందిస్తామని చెప్పారు. బ్యాంకు అధికారులతో సోమవారం జరిగిన సమావేశంలో మిషన్ భగీరథ బడ్జెట్ ఎస్‌ఇ విజయ్‌కుమార్, ఈఈ విజయ్‌కుమార్, యూనియన్ బ్యాంక్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ చిరంజీవి, క్రెడిట్ డిపార్ట్‌మెంట్ మేనేజర్ అర్జున్, మార్కెటింగ్ ఆఫీసర్ భరత్ పాల్గొన్నారు.