తెలంగాణ

దేశభక్తికి చిరునామా ఎబివిపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, డిసెంబర్ 25: విద్యార్థి పరిషత్ నేతగా నేర్చుకున్న పాఠాలే రాజకీయంగా ఎదగడానికి దోహదపడ్డాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) రాష్ట్ర 33వ మహాసభలు శుక్రవారం జిల్లాకేంద్రం సంగారెడ్డిలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా హాజరైన కేంద్ర మంత్రి ధర్మేంద్ర జెండా, జ్యోతి ప్రజ్వలనతో మహాసభలను ప్రారంభించి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. జ్ఞానం, శీలం, ఏకత, ఏకాత్మ భావనతో దేశభక్తిని నిర్మాణం చేసే విద్యార్థి పరిషత్ సంఘటిత శక్తి కోసం కృషి చేస్తుందన్నారు. విద్యార్థి పరిషత్ ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘమన్నారు. జీవ వైవిద్యాలను తెలిపే సంస్థ అన్నారు. దేశ చరిత్ర క్రమంగా కనుమరుగవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ చరిత్రను తెలిపే సంఘటనలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జల్సాలకు అలవాటు పడకుండా దేశం, సంఘం, సంఘటితం కోసం కృషి చేయాలని, శక్తిని వినియోగించాలని సూచించారు. ఎబివిపి జాతీయ కార్యదర్శి నరేష్ మాట్లాడుతూ ఎబివిపి విద్యార్థుల సమస్యలతో పాటు దేశం ఎదుర్కొంటున్న అతి సున్నితమైన శాంతి భద్రతలు, సరిహద్దుల విషయంలోను సంఘటితంగా నిర్మాణాత్మకమైన పోరాటాలు చేస్తుందన్నారు. విద్యార్థులలో మేథోసంపత్తిని పెంపొందించడానికి సృజన కార్యక్రమం ద్వారా ప్రోత్సహిస్తుందన్నారు. అవినీతి అంతం ఎబివిపి పంతం అనే నినాదంతో కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల్లో చైతన్యం నింపిందన్నారు. సంచార జాతుల సర్వేను పరిషత్ చేపట్టి వారి అభివృద్ధికి పలు సూచనలు, సలహాలు అందజేసిందన్నారు. స్వరాష్ట్ర స్వప్నం సాకారంలోనూ పరిషత్ కీలక భూమికను పోషించిందని గుర్తుచేశారు. పరిషత్ నాయకులుగా సేవలందిస్తూ సంఘ విద్రోహ దాడులు, వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన నాయకుల చిత్ర పటాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎబివిపి ప్రేరణ పుస్తకం, 2016 క్యాలెండర్‌ను కేంద్ర మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ నెల 27వ తేదీ వరకు మహాసభలు కొనసాగనున్నాయి. మహాసభల సందర్భంగా ఎబివిపి నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా చెన్న క్రిష్ణారెడ్డి, అయ్యప్పలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.