రాష్ట్రీయం

మిషన్ భగీరథకు నిధుల ప్రవాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 20:మిషన్ భగీరథ పథకానికి రుణాలు ఇవ్వడానికి పలు బ్యాంకులు ముందుకు వచ్చాయి. పంచాయితీరాజ్ స్పెషల్ సిఎస్ మిషన్ భగీరథ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్పీసింగ్‌ను బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు వేరువేరుగా మంగళవారం కలిశారు. మిషన్ భగీరథకు 2270 కోట్ల రూపాయల రుణం ఇవ్వనున్నట్టు బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలంగాణ జోనల్ మేనేజర్ విశ్వనాథ్ తెలిపారు. సురక్షితమైన మంచినీటిని అందించడం ప్రాథమిక హక్కుగా గుర్తించి మిషన్ భగీరథ పథకాన్ని ప్రభుత్వం చేపట్టడం అభినందనీయమని, ఈ పథకంలో పాలు పంచుకోవడం సంతోషంగా ఉందని విశ్వనాథ్ తెలిపారు. రంగారెడ్డి- శ్రీశైలం సెగ్మెంట్‌కు 1800 కోట్లు, మహబూబ్‌నగర్- ఎల్లూరు సెగ్మెంట్‌లోని కల్వకుర్తి- కమ్మదనం- కొడంగల్ సబ్ పనులకు 470 కోట్ల రుణం ఇవ్వనున్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మిషన్ భగీరథకు రెండువేల కోట్ల రూపాయల రుణం ఇవ్వడానికి ముందుకు వచ్చింది.