రాష్ట్రీయం

టి.గ్రూప్-2 షెడ్యూలులో మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 20: తెలంగాణలో నిర్వహించబోయే గ్రూప్-2 స్థాయి పోస్టుల ఎంపిక పరీక్ష షెడ్యూలులో పబ్లిక్ సర్వీసు కమిషన్ స్వల్ప మార్పులు చేసింది. గతంలో ప్రకటించిన షెడ్యూలు ప్రకారం నవంబర్ 12, 13 తేదీల్లో నిర్వహించాల్సి ఉన్నా, అదే రోజు ఇండియన్ ఫారెస్టు సర్వీసు ఎంపిక పరీక్షను యుపిఎస్‌సి నిర్వహిస్తుండటంతో షెడ్యూలులో మార్పులు చేసినట్టు కమిషన్ కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్ చెప్పారు. తాజా షెడ్యూలు ప్రకారం గ్రూప్-2ను నవంబర్ 11, 13 తేదీల్లో నిర్వహిస్తారు. 11న పేపర్-1, పేపర్-2 జరుగుతుంది. 13న పేపర్-3, పేపర్-4 జరుగుతాయి. పేపర్-1 ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12.30 వరకూ, పేపర్-2 మధ్యాహ్నం 2.30 నుండి 5 గంటల వరకూ, 14న పేపర్-3 ఉదయం 10 నుండి 12.30 వరకూ, అదే రోజు సాయంత్రం పేపర్-4 మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5 గంటల వరకూ జరుగుతుంది. కాగా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు (నోటిఫికేషన్ 16/2016) ఈ నెల 25వ తేదీన ఎంపిక పరీక్ష నిర్వహిస్తున్నారు. 25వ తేదీ ఉదయం 10 గంటల నుండి 12.30 వరకూ పేపర్-1, సాయంత్రం 2.30 నుండి 5 గంటల వరకూ పేపర్-2 జరుగుతాయి. పరీక్షకు 808 దరఖాస్తు చేశారు. వీరి కోసం హైదరాబాద్‌లో 3 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు వెబ్‌సైట్ నుండి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని కార్యదర్శి సూచించారు.
కాగా గ్రౌండ్ వాటర్ డిపార్టుమెంట్‌లో అసిస్టెంట్ కెమిస్ట్ (నోటిఫికేషన్ 07/2016), అసిస్టెంట్ జియో ఫిజిసిస్టు, అసిస్టెంట్ హైడ్రాలజిస్టు, అసిస్టెంట్ హైడ్రో జియాలజిస్టు పోస్టులకు జరిగిన ఎంపిక పరీక్ష నుండి 39 మంది అభ్యర్థులను తుది ఎంపిక చేసినట్టు కార్యదర్శి చెప్పారు. ఆ జాబితాను కమిషన్ వెబ్ సైట్‌లో ఉంచినట్టు ఆమె తెలిపారు. 79 మందిని ఇంటర్వ్యూలకు పిలిచి 17వ తేదీన ఇంటర్వ్యూలను నిర్వహించామని, ఒకే రోజు నాలుగు ఇంటర్వ్యూ బోర్డులను ఏర్పాటు చేసి ఎంపిక పూర్తి చేశామని వివరించారు.