రాష్ట్రీయం

రివాల్వర్ చూపించి రిజిస్ట్రేషన్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 20: ‘టేబుల్‌పై రివాల్వర్ పెట్టి...మల్లన్న సాగర్ రైతుల వద్ద నుంచి బలవంతంగా భూముల రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు..’ అని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్‌సింగ్ ఆరోపించారు. కాంగ్రెస్ తరపున ఎన్నికైన స్థానిక ప్రజాప్రతినిధుల శిక్షణాతరగతుల ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ మల్లన్న సాగర్ రైతులకు తమ పార్టీ అండగా ఉంటుందన్నారు. మల్లన్న సాగర్ పరిథిలోని గ్రామాల్లో రెండు వాహనాలు పెడుతున్నారని, అందులో ఒకటి పోలీసు వాహనం, రెండవది ప్రభుత్వ వాహనం అని ఆయన తెలిపారు. మల్లన్నసాగర్ జలాశయం పరిధిలోని రైతులు తమ భూములను ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేయకపోతే పోలీసు వాహనం ఎక్కిస్తున్నారని, రిజిస్ట్రేషన్ చేస్తామంటే ప్రభుత్వ వాహనంలో రిజిస్ట్రేషన్ కార్యాలయానికి తీసుకెళుతున్నారని ఆయన చెప్పారు. ‘మీరు జమీందార్ కావచ్చు, ఇలా ప్రజలను బెదిరించడం భావ్యం కాదు, ఇది నిజాం పాలన కాదు, ప్రజల పాలన..’ అని ఆయన ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ఉద్దేశించి అన్నారు.
వేల కోట్ల రూపాయల అవినీతి
వాటర్ గ్రిడ్ పథకంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఇస్తున్న నిధులకు కోత విధించి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు మళ్లిస్తున్నారని ఆయన విమర్శించారు. ఎమ్మెల్యేలను, ఇతర ప్రజాప్రతినిధులను కూరగాయలు కొన్నట్లు కొంటున్నారని ఆయన విమర్శించారు. ఐదేళ్ళలో భారీగా డబ్బులు సంపాదించి వచ్చే (2019) ఎన్నికల్లో ఆ డబ్బులతో ఓట్లు కొనుగోలు చేయాలనుకుంటున్నారని ఆయన విమర్శించారు. కానీ తెలంగాణ ప్రజలు ఆత్మాభిమానం కలవారని, డబ్బులకు అమ్ముడుపోరని అన్నారు.
పోలవరం ఓ లాలీపాప్..
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేం కాబట్టి పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేపడతామని ఏపి సిఎం చంద్రబాబుకు కేంద్రం ఓ లాలీపాప్ ఇచ్చిందన్నారు. పోలవరం ప్రాజెక్టు కింద ఎక్కువగా గిరిజనులే నష్టపోతున్నారని ఆయన చెప్పారు. దీనికి పర్యావరణ అనుమతి కూడా లేదని ఆయన తెలిపారు.