రాష్ట్రీయం

బైపాస్ నుంచి సీలేరు జలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమండ్రి, డిసెంబర్ 25: గోదావరి డెల్టా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా డిసెంబర్ నెలలోనే సీలేరు బైపాస్ జలాలపై ఆధారపడాల్సిన పరిస్థితి తలెత్తటం గోదావరి రైతులు తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గోదావరి డెల్టాలో పూర్తి ఆయకట్టుకు అనుమతినిస్తామని రాష్ట్రప్రభుత్వం భరోసా ఇవ్వటంతో రబీకి సాగుకు సిద్ధమైన రైతులను తాజా పరిణామాలు తీవ్రంగా కలవరపెడుతున్నాయి. గోదావరి డెల్టాలో రైతులు రబీ సాగుచేసేందుకు పూర్తిగా సీలేరు జలాలపైనే ఆధారపడుతుంటారు. మోతుగూడెం జల విద్యుత్ కేంద్రంలోని నాలుగు యూనిట్లలో జల విద్యుత్ చేయటం ద్వారా సుమారు 4500 క్యూసెక్కులు నీరు సీలేరు ద్వారా గోదావరిలో కలుస్తుంది. ఈ నీరే ప్రతి సంవత్సరం గోదావరి డెల్టాను ఆదుకుంటుంది. రబీ చివరి దశలో అంటే ఫిబ్రవరి, మార్చి నెలల్లో కీలక దశకు రబీ పంట చేరుకున్నపుడు పంటను రక్షించుకునేందుకు బైపాస్ మార్గంలో సీలేరు జలాలను తీసుకోవటం దశాబ్దాల తరబడి జరుగుతున్న కార్యక్రమం. జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్‌ను ఉత్పత్తి చేయటం ద్వారా నీటిని గోదావరిలోకి తరలిస్తే విద్యుత్ ఉత్పత్తికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ బైపాస్ మార్గంలో నీటిని తీసుకుని గోదావరి డెల్టాకు నీటిని సరఫరాచేస్తే జల విద్యుత్ ఉత్పత్తికి కొంచెం ఇబ్బంది వస్తుంది. ఈ ఇబ్బందిని కూడా పట్టించుకోకుండా, రాష్ట్రప్రభుత్వం కీలక దశ రబీ పంట చివరి దశలో బైపాస్ మార్గంలో నీటిని గోదావరి డెల్టాకు విడుదలచేస్తుంది. కానీ ఈసారి గతంలో ఎప్పుడూ లేని విధంగా రబీ పంట తొలి దశ నుండే బైపాస్ జలాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా అయితే జల విద్యుత్ ఉత్పత్తికి నష్టం జరుగుతుందన్నది ఏపి జెన్‌కో వాదన. గోదావరి జిల్లాల రైతులు, ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకు గత నాలుగు రోజులుగా విద్యుత్ ఉత్పత్తి ద్వారా 4500క్యూసెక్కులను విడుదలచేస్తూనే, బైపాస్ మార్గంలో మరో 1500క్యూసెక్కులను జెన్‌కో విడుదలచేసింది. ఇక ఎక్కువ కాలం ఇలా బైపాస్ మార్గంలో విడుదలచేయలేమన్న ఉద్దేశ్యంతో, గురువారం మధ్యాహ్నం నుండి సీలేరు బైపాస్ జలాలను జెన్‌కో నిలిపివేసింది. దాంతో ఒక్కసారిగా గోదావరి డెల్టాకు సరఫరాచేస్తున్న నీటి ప్రవాహం తగ్గిపోయింది. మరోపక్క బ్యారేజికి ఎగువన ఉన్న పంపింగ్ స్కీంలు షరామామూలుగా నడిచిపోతుండటంతో గోదావరి డెల్టాకు డిసెంబర్ నెలాఖరులోనే కటకట ఏర్పడింది. దాంతో అధికారులు పరిస్థితిని జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమ దృష్టికి తీసుకెళ్లటంతో, మళ్లీ శుక్రవారం ఉదయం నుండి సీలేరు బైపాస్ జలాలను జెన్‌కో విడుదలచేయటం మొదలుపెట్టింది. దాంతో గోదావరి డెల్టా రైతులు కాస్త ఊపిరి పీల్చుకున్నప్పటికీ, రబీ పంటకు మాత్రం రానున్న రోజుల్లో పెద్ద ప్రమాదమే పొంచి ఉన్నట్టేనని జలవనరులశాఖ అధికారులు చెబుతున్నారు. గోదావరిలో అసాధారణంగా తగ్గుతున్న నీటి ప్రవాహాన్ని బట్టి చూస్తే అధికారులు, ప్రజాప్రతినిధులు ఎంత కష్టపడినాగానీ, ఎత్తయిన ప్రదేశాల్లో ఉన్న ఆయకట్టుకు నీటిని సరఫరా చేయటం కష్టమనిపిస్తోందని జలవనరులశాఖ అధికారులు చెబుతున్నారు. ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా రైతులు త్వరగా సాగు మొదలుపెట్టడం లేదని

కన్నకూతుర్ని దారుణంగా
హతమార్చిన తల్లిదండ్రులు

టెక్కలి, డిసెంబర్ 25: శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం గూడెం పంచాయతీ పరిధిలోని సోమనాథపురం గ్రామానికి చెందిన బగాది జయలక్ష్మి(32) అనే వివాహిత శుక్రవారం దారుణంగా హత్యకు గురైంది. టెక్కలి ఎస్‌ఐ రాజేష్ కథనం ప్రకారం గత కొంతకాలంగా కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన గొడవలతో మనస్పర్థలు పెరిగి చివరకు జయలక్ష్మి హత్యకు దారి తీసింది. శుక్రవారం ఉదయం ఆమె సోదరుడు కణితి మురళీ, తండ్రి కణితి భూపతిచౌదరి, జయలక్ష్మి మధ్య గొడవ జరిగింది. దీంతో కోపం పట్టలేక తండ్రి, తమ్ముడు కర్రతో బలంగా జయలక్ష్మి తలపై కొట్టారు. దీంతో స్పృహ తప్పి కింద పడిపోయిన జయలక్ష్మిని ఆమె తల్లి ప్రభావతి మెడపై కాలుతో బలంగా తొక్కడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. జయలక్ష్మి భర్త బగాది జగ్గారావు వృత్తిరీత్యా బిఎస్‌ఎఫ్ జవాను. మృతురాలికి కొడుకు, కూతురు ఉన్నారు. గూడెం ఇన్‌ఛార్జి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు టెక్కలి ఎస్‌ఐ రాజేష్ కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. సిఐ భవానీప్రసాద్ దర్యాప్తు చేస్తున్నారు.

నా ప్రాణాలకు ముప్పు
పాడేరు ఎమ్మెల్యే ఈశ్వరి ఆందోళన

పాడేరు, డిసెంబర్ 25: తన ప్రాణాలకు ముప్పు ఉందని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తున్నందున ముఖ్యమంత్రి నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని శుక్రవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే తనపై దేశద్రోహం, హత్యాయత్నం వంటి నేరాల కింద కేసులు పెట్టించారని ఆమె ఆరోపించారు. ఈనెల 10న చింతపల్లిలో జరిగిన బాక్సైట్ సభలో తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపించారు.
ఉత్తర కోస్తాకు వర్ష సూచన
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, డిసెంబర్ 25: బీహార్ నుంచి ఒడిశా వరకూ అల్పపీడన ద్రోణి ఏర్పడిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శుక్రవారం రాత్రి తెలిపారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాలో ఒకటి, రెండుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అయితే ఉత్తర, ఈశాన్య దిశగా గాలులు వీస్తుండటంతో రాత్రి వేళల్లో కొద్దిగా చలి పెరిగే అవకాశం ఉందన్నారు.