రాష్ట్రీయం

ఖమ్మం జిల్లాలో పొంగిన వాగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, సెప్టెంబర్ 23: ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం విస్తారంగా వర్షాలు కురిశాయి. జిల్లాలో టేకులపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు మండలాల్లో భారీ వర్షపాతం నమోదు అయింది. కినె్నరసాని ప్రాజెక్టు నిండడంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు తాలిపేరుకు వరద నీరు చేరుతుండడంతో దిగువనున్న ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. గురువారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు ఓపెన్‌కాస్ట్‌లో బొగ్గు ఉత్పత్తులు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గ్రామాలు అంథకారంలోకి ఉండిపోయాయి. అశ్వారావుపేట మండలంలో 28 గ్రామాలతో పాటు ఏజెన్సీ ప్రాంతలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలో అత్యధికంగా టేకులపల్లి మండలంలో 110.4 మిల్లిమిటర్ల వర్షపాతం నమోదు అయింది. బయ్యారం పెద్దచెరువు నిండి అలుగు పడడంతో మునే్నటిలోకి భారీగా వరదనీరు చేరుతుంది. పాకాలేరు నుండి మునే్నటిలోకి వరద నీరు చేరడంతో 1000 క్యూసెక్కుల నీరుకు పైగా ఖమ్మం మునే్నటిలో ప్రవహిస్తుంది. ఇల్లెందులో కురిసిన భారీ వర్షాలకు ఇల్లెందు తహశీల్దార్ పాత కార్యాలయం పైకప్పు కూలిపోయింది.

చిత్రం.. కినె్నరసాని ప్రాజెక్టు ద్వారా కిందికి నీరు వదులుతున్న దృశ్యం