రాష్ట్రీయం

తస్మాత్... జాగ్రత్త!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, సెప్టెంబర్ 24: ‘ఇప్పుడు ఎక్కడ చూసినా పిల్లలంతా స్మార్ట్ఫోన్లతో దర్శనమిస్తున్నారు. అయితే ఒక్క దోమ కుడితే అందరూ అనారోగ్యంతో పడుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఈ విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండకపోతే జీవితాలు ఇబ్బందికరంగా మారతాయి’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. పరిసరాల పరిశుభ్రతపై అందరికీ చైతన్యం రావాలని, పిల్లలు కూడా బాధ్యత తీసుకుని దోమలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికే ఈ విషయంలో యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటూ దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిందని, దీనిలో అన్ని స్థానికసంస్థలు, జిల్లా యంత్రాంగాలు పూర్తిగా భాగస్వాములు అవుతాయని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ప్రభుత్వం చేపట్టిన ‘దోమలపై దండయాత్ర’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి శనివారం ప్రారంభించారు. ఈసందర్భంగా చెత్త తొలగింపునకు వినియోగించే మినీ వాహనాలను పంపిణీ చేశారు. అంతకుముందు ఏలూరులో విద్యార్థినీవిద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో దోమలపై దండయాత్రకు సంబంధించి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. దోమల వల్ల డెంగ్యూ, చికున్‌గున్యా, మెదడువాపు, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలు వస్తాయని, వీటినుంచి తప్పించుకోవడానికి దోమలపై దండయాత్ర ఒక్కటే పరిష్కారమని చంద్రబాబు అన్నారు. ఈవిషయంలో ఏలూరు విద్యార్థులు ప్రదర్శించిన స్కిట్ అభినందనీయంగా ఉందన్నారు. ఇకనుంచి రాష్టవ్య్రాప్తంగా ఎక్కడికక్కడ కౌన్సిలర్లు, వార్డు మెంబర్ల నుంచి అన్నిస్థాయిల్లోనూ ప్రజల్లో చైతన్యం పెంచేందుకు కృషి చేయాల్సిందేనని చెప్పారు. విజయవాడలోని కమాండ్ కంట్రోల్ రూం ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని తాను పర్యవేక్షిస్తానని చెప్పారు. తాను పట్టు పడితే ఉడుం పట్టేనని, రాష్ట్రంలో దోమలు లేకుండా చేసేవరకు ఈ కార్యక్రమాన్ని నిరంతరం ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు. రాష్ట్రంలోని 110 మున్సిపాల్టీలు అప్రమత్తం కావాలని, తాను హెలికాప్టర్ ద్వారా కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తానన్నారు.
కాగా రాష్ట్రంలో 149 రూపాయలకే వంద టివి ఛానళ్లు, వీడియో కాన్ఫరెన్సింగ్ సౌకర్యం, ఇంటర్నెట్, మూడు ఫోన్లను అందించే లక్ష్యంతో బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. ఫైబర్‌గ్రిడ్ ద్వారా దీనిని ప్రతి కుటుంబానికి అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పీతల సుజాత, ఎంపిలు తోట సీతారామలక్ష్మి, మాగంటి బాబు, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్, వైద్యఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. దోమలపై దండయాత్ర ర్యాలీలో ప్లకార్డు పట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు