రాష్ట్రీయం

రెంటికీ చెడ్డ రేవడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 24: తెలంగాణలో నిర్వహించిన ఎమ్సెట్-3లో అర్హత సాధించిన విద్యార్ధుల్లో 95 శాతం మందికి మెడికల్, డెంటల్ సీట్లు రాకపోగా, వేరే ఏ ఇతర కోర్సుల్లో చేరేందుకు కూడా వీలు లేకపోవడంతో వారి పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడి మాదిరి మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఎమ్సెట్-2 ద్వారా అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ , బయోటెక్నాలజీ , వెటర్నరీ సీట్లను భర్తీ చేస్తోంది. దానికి దరఖాస్తు గడువు ఎమ్సెట్-3 ఫలితాలు రాకముందే ముగిసింది. ఎమ్సెట్ -3 రాసిన చాలా మంది విద్యార్ధులు ఎమ్సెట్-2 తప్పనిసరి రాయాలనే అవగాహన లేక ఆగిపోయారు, అదే మాదిరి నీట్ పరీక్షకు కూడా చాలా మంది హాజరుకాకపోవడంతో యాజమాన్య కోటా కేటగిరి -బి, కేటగిరి -సి సీట్లకు అర్హులు కాలేదు. కొంత మంది హాజరైనా క్వాలిఫై కాకపోవడంతో వారు మేనేజిమెంట్ కోటా సీట్లకు పనికిరాకుండా పోయారు. కనీసం సాధారణ డిగ్రీలో చేరుదాం అనుకున్నా ఈ ఏడాది తెలంగాణ ప్రభుత్వం ఆన్‌లైన్‌లో డిగ్రీ అడ్మిషన్లు నిర్వహించింది. నాలుగు నెలల పాటు ఐదు దశల్లో నిర్వహించిన డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది.కాలేజీల్లో మిగిలిపోయిన సీట్లకు అడ్మిషన్లు తీసుకుందామనుకున్నా స్పాట్ అడ్మిషన్లకు ప్రభుత్వం అంగీకరించడం లేదు. ఈ క్రమంలో ఎమ్సెట్-3లో అర్హులైన 36,834 మంది పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇటు వృత్తి విద్యాకోర్సుల్లో సీట్లు రాక, అటు సంప్రదాయ కోర్సుల్లో సీట్లు లేక అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. దీనికి కారణం ఎమ్సెట్ -3 పేరిట పరీక్ష నిర్వహించడం, దాని ఫలితాలను వెల్లడించే లోగానే మిగిలిన కోర్సుల చివరి తేదీ ముగియడమేనని విద్యార్ధుల తల్లిదండ్రులు వాపోతున్నారు. కనీసం డిగ్రీ కోర్సు చేద్దామనుకునే విద్యార్ధులకు సూపర్‌న్యూమరీ సీట్లు కల్పించి మరో దశ కౌనె్సలింగ్ నిర్వహిస్తే విద్యాసంవత్సరం నష్టపోకుండా ఉంటుందని వారు చెబుతున్నారు. ఎమ్సెట్-3కి 37,178 మంది హాజరుకాగా వారిలో 36,834 మంది అర్హత సాధించారు. 70 మంది ఇంటర్ ఫెయిలైనవారు, మరో 259 మంది ఇంటర్ పాసైనా ఆ డాటా అందుబాటులో లేని వారు ఉన్నారు. క్వాలిఫై అయిన వారిలో ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఇంత వరకూ 2వేల మందికి మాత్రమే సీట్లు దక్కాయి. మరో 34 వేల మంది పాలుపోని స్థితిలో ఉన్నారు. ఎమ్సెట్ -3 రాసిన వారిలో కొద్ది మంది మాత్రమే ఇతర కోర్సుల్లో ఇప్పటికే చేరారని అధికారులు చెబుతున్నారు.