రాష్ట్రీయం

హైదరాబాద్-విశాఖపట్నం ప్రత్యేక రైళ్లు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 24: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్-విశాఖపట్నం-సికిందరాబాద్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా తెలిపారు. ట్రైన్ నెం. 07071 హైదరాబాద్-విశాఖపట్నం మధ్య ఈ నెల 28, అక్టోబర్ 5, 12, 19, 26 తేదీల్లో నడిచే ప్రత్యేక రైళ్లు, ట్రైన్ నెం. 07072 విశాఖపట్నం-సికిందరాబాద్ మధ్య ఈ నెల 29, అక్టోబర్ 6, 13, 20, 27 తేదీల్లో నడిచే ప్రత్యేక రైళ్లను రద్దు చేసినట్టు జిఎం వివరించారు.
సత్తెనపల్లి-గుంటూరు-నడికుడి సెక్షన్లలో నీట మునిగిన రైల్వే ట్రాక్‌ల పునరుద్ధరణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టినట్టు రవీంద్రగుప్తా తెలిపారు. శనివారం ఆయన రైల్వే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తెలెత్తకుండా వారివారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారం తీసుకుంటున్నట్టు చెప్పారు. పలు రైల్వే స్టేషన్లలో నిలిచిపోయిన రైళ్లలోని ప్రయాణికులకు ఆహారం, నీటి వసతి కల్పించటంతో పాటు ఆర్టీసి బస్సుల్లో వారిని వారి గమ్యస్థానాలకు చేర్చే ప్రయత్నం చేస్తున్నట్టు జిఎం వివరించారు. నడికుడి మార్గంలో, కాజీపేట్ జంక్షన్ పరిధిలోని మార్గాల్లో మొత్తం ఆరు ప్రాంతాల్లో వర్షం కారణంగా రైలు పట్టాలు నీట మునిగాయని, కొన్ని చోట్ల పట్టాలు దెబ్బతిన్నాయని జిఎం పేర్కొన్నారు. వెంటనే వాటి మరమ్మతులకు కావలసిన సిమెంట్, క్వారీ డస్ట్, ఇసుక వంటి వాటితోపాటు మ్యాన్‌పవర్‌ను వినియోగించుకోవాలని, అందుకు ఇతర జోన్ల సిబ్బందిని కూడా వినియోగించుకోవాలని రవీంద్రగుప్తా ఆదేశించారు. ప్రధానంగా నడికుడి-గుంటూరు మధ్య రైల్వే ట్రాక్ తీవ్రస్థాయిలో దెబ్బతిందని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని సూచించారు.