రాష్ట్రీయం

పొంగుతున్న వాగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, సెప్టెంబర్ 24: ఖమ్మం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కినె్నరసాని, తాలిపేరు ప్రాజెక్టులు నిండడంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. జిల్లాలోని లంకాసాగర్, మసి వాగులతో పాటు పలు వాగులు పొంగిపొర్లుతున్నాయి. బయ్యారం పెద్ద చెరువు నిండి అలుగు ద్వారా నీరు ప్రవహిస్తుండడంతో మునే్నరుకు భారీగా వరదనీరు చేరడంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. మునే్నరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలోని పాతలింగాల వద్ద బ్రిడ్జిపైకి నీరు పొంగిపొర్లుతోంది. దీంతో ఖమ్మం నుండి విజయవాడకు రాకపోకలు స్తంభించాయి. ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న వరదలపై రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.