రాష్ట్రీయం

గట్టెక్కిన కూలీలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 25: మెదక్ జిల్లా ఏడుపాయలలో చిక్కుకున్న కూలీలను రక్షించడానికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు చూపిన చొరవ ఫలించింది. ఏడుపాయల వద్ద జరుగుతున్న బ్రిడ్జి పనులు చేయడానికి నాలుగు రోజుల కిందట ఒరిస్సా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 23 మంది నిర్మాణ కూలీలు (ఒకరు మహిళ) వచ్చారు. అయితే సింగూరు నుంచి నీటి ప్రవాహం పెరగడంతో ఘనపురం నుంచి నీరు విడుదల చేశారు. దీంతో ఏడుపాయల వద్ద రెండు పాయల మధ్య భూభాగంలో కూలీలు చిక్కుపడిపోయారు. ఈ విషయాన్ని శనివారం అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి ప్రభుత్వ హెలికాప్టర్‌ను తీసుకెళ్లి రక్షించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ హెలికాప్టర్ నీళ్ల మధ్యలోకి దిగి కూలీలను కాపాడటం సాధ్యం కాదని, అది ఎయిర్ ఫోర్స్‌కు చెందిన హెలికాప్టర్‌కు మాత్రమే సాధ్యపడుతుందని అధికారులు వివరించారు. ఎయిర్ ఫోర్స్ అధికారులతో మాట్లాడి ముఖ్యమంత్రి హెలికాప్టర్ తెప్పించారు. ఆదివారం ఎయిర్ ఫోర్స్‌కు చెందిన హెలికాప్టర్ ఏడుపాయలుకు చేరుకుంది. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మెదక్ కలెక్టర్ రోనాల్డ్ రాస్ ఏడుపాయలకు చేరుకుని పర్యవేక్షించారు. ఎట్టకేలకు ఎయిర్ ఫోర్స్ సిబ్బంది కూలీలు అందరినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. ప్రమాదం నుంచి కూలీలు బయటపడటంతో ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ప్రజల నుంచి వచ్చే సమాచారానికి అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపడితే ఎలాంటి ప్రమాదాల నుంచైనా కాపాడవచ్చని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.

చిత్రం.. మెదక్ జిల్లా ఏడుపాయల లంకలో కూలీలు చిక్కుకున్న ప్రాంతం.. వారిని వాయుసేన ప్రాణాలతో ఒడ్డుకు చేర్చిన ప్రాంతం