రాష్ట్రీయం

బ్రహ్మాస్త్రం వేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 25: ప్రత్యేక హోదా ద్వారానే ఆర్ధిక సంక్షోభంతో సతమతమవుతున్న ఆంధ్ర రాష్ట్రానికి సంపూర్ణ ప్రయోజనాలు చేకూరుతాయని ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. అవసరమైతే హోదా సాధనకు తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయిస్తానన్నారు. హోదా సాధనకు వామపక్షపార్టీలతో, ప్రజా సంఘాలతో కలిసి పోరాడుతామని చెప్పారు. ఎంపీలతో రాజీనామా చేయించడమనేది బ్రహ్మాస్తమ్రన్నారు. వచ్చే ఎన్నికల్లో బిజెపికి 280 సీట్లు రావన్నారు. ఏ పార్టీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ రాదన్నారు. ఆ సమయంలో ఆంధ్రాకు హోదా ఇచ్చే పార్టీకే మద్దతు ఇస్తామన్నారు. దీనికోసం ఏపిలో 25కు 23 సీట్లు తాము సాధించాలన్నారు. ఆంధ్ర నుంచి ఎన్నికయ్యే పార్టీ మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి వచ్చే ఎన్నికల్లోవస్తుందన్నారు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు మాత్రమే ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి పణంగా పెట్టారని ఆరోపిస్తూ, చంద్రబాబును ఉన్మాది, సైకో అని జగన్ అభివర్ణించారు. తాను రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతుంటే సైకో అనడంలో అర్ధం లేదన్నారు. ఆదివారం రాత్రి ఆయన లోటస్‌పాండ్‌లోని కార్యాలయం నుంచి యుకె, అమెరికా, కువైట్, కొలంబియా తదితర దేశాల్లోని ప్రవాసాంధ్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. టిడిపి తన పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించాలని, బిజెపి మంత్రివర్గం నుంచి మంత్రులు బయటకు రావాలన్నారు. ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాటాన్ని ఆపే ప్రసక్తిలేదన్నారు. ప్రత్యేక హోదా సంజీవని కాదన్న చంద్రబాబు, డొల్లతనంతో ఉన్న ప్యాకేజీని కేంద్రం ప్రకటిస్తే చంద్రబాబు ఆహ్వానించడమేంటన్నారు. రాష్ట్రం విడగొట్టేటప్పుడు ప్రత్యేక హోదా సంజీవని అని ప్రకటించిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఈ రోజు మాట మార్చారన్నారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ శెనక్కాయలు, బెల్లాలకు కూడా సరిపోవని, అన్ని రాష్ట్రాలకు ఇచ్చే నిధులే, ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చారన్నారు. ఇందులో ప్రత్యేకత అంటూ ఏ లేదన్నారు. 14వ ఆర్ధిక సంఘానికి హోదా ఇవ్వాలా లేదా అని సిఫార్సు చేసే అధికారం లేదన్నారు. ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అధికారం కేవలం ప్రధాన మంత్రికి మాత్రమే ఉందన్నారు.