రాష్ట్రీయం

108 ఏళ్ల తరువాత రికార్డు స్థాయి వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 25: హైదరాబాద్‌లో ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. 108 ఏళ్ల తరువాత ఇంత భారీ వర్షం కురిసినట్టు అధికారులు పేర్కొంటున్నారు. 1908 సెప్టెంబర్‌లో 499 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా, 2016 సెప్టెంబర్‌లో 407 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. వందేళ్ల క్రితంతో పోలిస్తే 92 మిల్లీ మీటర్లు తక్కువే. గత 30 ఏళ్లలో 132 మిల్లీ మీటర్ల సాధారణ వర్షపాతం నమోదైంది. ఈ సంవత్సరం జూన్‌లో ప్రారంభమైన రుతుపవనాలు అల్పపీడనంగా మారి జూలై, ఆగస్టులో ఓ మోస్తరుగానే వర్షాలు కురిశాయి. సెప్టెంబర్ 15 తరువాత బంగాళాఖాతంలో రెండుసార్లు ఏర్పడిన అల్పపీడన ద్రోణి ఉపరిత ఆవర్తనంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. 35ఏళ్లలో సాధారణ వర్షపాతం నమోదుతో పోల్చి చూస్తే ఈ సెప్టెంబర్‌లో 407 మిల్లీ మీటర్ల వర్షం కురిసి వందేళ్లనాటి వర్షపాత నమోదుతో హైదరాబాద్ నగరం రికార్డు స్థాయికి చేరింది.