రాష్ట్రీయం

తిరుమలలో పోలీస్ సేవాదళ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, సెప్టెంబర్ 25: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు పటిష్ఠ బం దోబస్తుతో పాటు భక్తులకు పోలీస్ శాఖ తరపున స్నేహపూర్వకంగా సేవ లు అందిస్తామని ఆంధ్రప్రదేశ్ డిజిపి సాంబశివరావు తెలిపారు. ఆదివారం ఉదయం ఆయన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రాయలసీమ ప్రాం తానికి చెందిన పలువురు పోలీస్ ఉన్నతాధికారులతో కలసి ఆలయ తిరుమాడ వీధులు, రాంభగీచ తదితర ప్రదేశాలను పరిశీలించారు. అక్టోబర్ 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న శ్రీవారి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలకు కల్పించాల్సిన భద్ర తా ఏర్పాట్ల గురించి అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయ న విలేఖరులతో మాట్లాడుతూ భక్తులకు స్నేహపూర్వకంగా సేవలు అం దించేందుకు 150 మంది సిబ్బందితో ప్రత్యేకంగా పోలీస్ సేవాదళ్‌ను ఏర్పా టు చేస్తున్నామన్నారు. పోలీస్ సేవాదళ్ ద్వారా సేవలు అందించే సిబ్బంది సాధారణ దుస్తులతో విధు లు నిర్వర్తిస్తారని అన్నారు. భక్తులకు కోరిన సమాచారం అందించడంతో పాటు వారికి భద్రతాపరంగా ఇబ్బందులు తలెత్తినప్పుడు పరిష్కరించేందుకు వీరు సహకరిస్తారన్నారు. గత బ్రహ్మోత్సవాలకన్నా ఈ ఏడాది నిర్వహించే ఉత్సవాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఫీన్స్, చైల్డ్ ట్యాగింగ్ టెక్నాలజీని బ్రహ్మోత్సవాల్లో మొట్టమొదటిసారిగా ప్రవేశపెడతామన్నారు. ఈ ట్యా గింగ్ విధానం ద్వారా ప్రతి చిన్నారికీ ఒక్కో ప్రత్యేక గుర్తింపు కలిగిన ట్యా గ్‌ను ఏర్పాటుచేసి వారు తప్పిపోయినపుడు నిమిషాల వ్యవధిలో వారిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించవచ్చని తెలిపారు. తిరుమల, తిరుపతి అంతటా సిసి కెమెరాలతో జల్లెడ పడతామన్నారు. పటిష్ఠ భద్రత కల్పించడంలో భాగంగా తిరుమల తిరుపతి పోలీస్ సిబ్బందితోపాటు అదనపు బలగాలను మోహరించి భద్రత కల్పిస్తామన్నారు. భక్తులకు మెరుగైన సేవలతో పాటు తిరుమలకు పటిష్ఠ భద్రత కల్పించేందుకు టిటిడి ఉన్నతాధికారులు, బోర్డు చైర్మన్ శ్రద్ధ చూపుతున్నారని, ఇందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు.