రాష్ట్రీయం

తస్మాత్.. జాగ్రత్త!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 25: మం త్రుల తనయులపై వస్తున్న ఫిర్యాదులపై ఎట్టకేలకు స్పందించిన ఏపి ము ఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వారిని పిలిచి క్లాసు పీకి, ఇదే చివరి హె చ్చరిక అన్నారు. మీ పనితీరు మార్చుకోవాలని, నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోకుండా, వివాదాలకు దూరంగా ఉండి, జననేతలుగా ఎదగాలని హిత వు పలికారు.
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కొందరు మంత్రుల తనయులపై గత రెండున్నరేళ్లుగా వస్తున్న ఫిర్యాదులకు తెరదించేందుకు ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబునాయుడు నడుంబిగించారు. వీరిలో రాయలసీమ, ఉత్తరాంధ్రకు చెందిన మంత్రుల తనయులకు ఎక్కువగానే క్లాసు పీకారు. వారిని విడి విడిగా పిలిపించి పాఠాలు చెప్పారు.
ఆ సందర్భంలో వారిపై వస్తున్న ఫిర్యాదులను ఆధారాలతో ప్రస్తావిస్తూ ఈ పద్ధతి మీ తండ్రి రాజకీయ భవిష్యత్తుకే కాకుండా మీ భవిష్యత్తుకూ మంచిదికాదని హెచ్చరించారు. ఉత్తరాంధ్రకు చెందిన ఒక మంత్రి తనయుడి సెటిల్‌మెంట్లపైనా సీఎం మందలించారు. పేషీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. ఇప్పటికే నీ మీద చాలా ఫిర్యాదులొస్తున్నాయి. పద్ధతి మార్చుకో. లేకపోతే మీ నాన్నకూ చెడ్డపేరు వస్తుంది అని హెచ్చరించారు. రాయలసీమకు చెంది న మరో మంత్రి తనయుడికీ ఇదే విధంగా క్లాసు పీకారు. మీ వల్ల మీ తండ్రి ఏళ్ల నుంచి కష్టపడి సంపాదించుకున్న మంచిపేరు పోతోందని, దాని వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని, ఫాస్టుగా వెళితే దెబ్బతింటావని హెచ్చరించారు. ఈ సందర్భంగా పార్టీ పదే ళ్లు విపక్షంలో ఉన్నప్పుడు తాము చేసిన ఖర్చును ఆ యువనేత గుర్తు చేయగా, బాబు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రకాశం జిల్లాకు చెందిన ఒక యువనేతను కూడా తీవ్రంగా హెచ్చరించారు. ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో తనకు తెలుసునని నియోజకవర్గంలో ఎక్కువ జోక్యం చేసుకోకుండా, ఎమ్మెల్యేతో సమన్వయం చేసుకుని వెళ్లాలని, గ్రూపు రాజకీయాలు ప్రోత్సహించి తలనొప్పులు సృష్టించవద్దని మందలించారు.
సీమకు చెందిన మరోమంత్రి తనయుడికీ బాగానే తలంటు పోశారు. ఫ్యాక్షన్ రాజకీయాల జోలికి పోవద్దని మందలించారు. మీ కుటుంబ పెద్ద ఫ్యాక్షన్‌కు బలయ్యారని, నువ్వు కూడా ఆ బాట పట్టవద్దన్నారు. తండ్రి ఇమేజ్‌ను ఉపయోగించుకుని జనాలకు చేరువకావాలని హితవు పలికారు. ఈవిధంగా మంత్రుల తనయులకు తలంటుపోసిన బాబు ఒకరకంగా తీవ్రంగానే హెచ్చరించినట్లు తెలిసింది. వారానికొకరిని పిలిపించి, వారిని మందలించినట్లు పార్టీ వర్గాల సమాచారం. కొందరు మంత్రుల తనయుల పనితీరుతో పార్టీకి నష్టం వస్తుందని గ్రహించిన బాబు, నష్టనివారణ కోసం వారిని పిలిపించి హెచ్చరించడం ద్వారా దారికి తెచ్చే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది.
ఈ సందర్భంగా వారి తండ్రులతో తనకున్న అనుబంధం, పార్టీకి వారు చేసిన కష్టం, త్యాగాలను ప్రస్తావిస్తూనే.. వారు కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రతిష్టలను మీ పనితీరుతో మంట కలపవద్దని బాబు హితవు పలికారు. రాజకీయ భవిష్యత్తు ఉన్న మీరు ఈ వయసులో ఇమేజ్ కోల్పోయే పనులు చేయడం మంచిదికాదని, ప్రతిపక్షం మన బలహీనతలపైనే దృష్టి సారించినందున మరొకరికి వేలెత్తి చూపే అవకాశం ఇవ్వకుండా, మంచిపేరు తెచ్చుకోవాలని వారికి సూచించినట్లు సమాచారం.