రాష్ట్రీయం

కోర్టులనే తప్పుదారి పట్టిస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 25: అమరావతి ప్రాంతంలో అందునా కృష్ణానదీ తీరాన రాజధాని నిర్మాణం పర్యావరణానికే గొడ్డలిపెట్టు అంటూ పర్యావరణ జాతీయ ట్రిబ్యునల్‌లో పోరాడుతున్న సామాజికవేత్త బొలిశెట్టి సత్యనారాయణ నేతృత్వంలో రెండురోజులపాటు ఆ ప్రాంతంలో పర్యటించిన నిపుణుల బృందం వాస్తవిక పరిస్థితులను చూసి విస్మయానికి గురైంది. ట్రిబ్యునల్‌లో పర్యావరణ పరిరక్షణ కోసం వాదిస్తున్న ప్రముఖ న్యాయవాది సంజయ్ పారిక్, ప్రొఫెసర్ విక్రం సోని శుక్ర, శనివారాలు రెండురోజులపాటు మొత్తం 29 గ్రామాల్లోను విస్తృతంగా పర్యటించటం జరిగింది. భారీ వర్షాల కారణంగా ఉద్ధండరాయునిపాలెం లంక, మరో రెండు లంకలను సందర్శించి ఆదివారం ఢిల్లీకి వెనుదిరిగారు. ట్రిబ్యునల్‌లో ఈ కేసు దాఖలైన తొలి రోజుల్లో ప్రభుత్వ న్యాయవాది గంగూలీ లంక గ్రామాల్లో ఎవరూ నివసించటం లేదంటూ వాదించారంటూ న్యాయవాది పారిక్ చెప్పారు. వాస్తవ పరిస్థితులను చూసి సాక్ష్యాధారాలతో ట్రిబ్యునల్‌కు వివరించేందుకు తాను పర్యటించటం జరిగిందన్నారు. నదీ తీరంలో నదీ ప్రవాహాన్ని అడ్డుకట్ట వేసేలా చట్టవిరుద్ధంగా ఇసుక తెనె్నలపై ఎతె్తైన మెరకలు వేసి దానిపై రోడ్లు నిర్మించటంతో పాటు ఫ్లడ్‌లైట్లు కూడా ఏర్పాటు చేయటం తనను విస్మయపరిచిందన్నారు. రాజధాని ప్రాంతంలో ప్రధానంగా లంక గ్రామాల్లో దళితులు, గిరిజనులు వేలాదిమంది నివసిస్తున్నారని, ఏటా మూడు పంటలు పండే భూములన్నింటిని ప్రభుత్వం స్వాధీనపరచుకుని నిర్మాణాలు సాగించడంతో వారంతా ఉపాధి కోల్పోయి అలమటిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. లంక గ్రామాల్లో ప్రజలు సంతోషంగా సేంద్రీయ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారని అక్కడ కమ్యూనిటీ హాళ్లు, చర్చిలు కూడా ఉన్నాయని 90 దళిత కుటుంబాలు, పలు మత్స్యకార కుటుంబాలు ఉన్నాయని చెప్పారు. నాలుగు ప్రాంతాల్లో భారీ యంత్రాలతో అక్రమ ఇసుక మైనింగ్ జరుగుతోందని అదంతా మాఫియా చేతుల్లో ఉన్నట్టు కనిపిస్తోందన్నారు. అక్కడి ప్రజల ఆవేదనలను మొత్తం వీడియా రికార్డు చేయడం జరిగిందన్నారు. త్వరలోనే అన్నాహజారేను ఈ ప్రాంతంలో పర్యటించేలా ఏర్పాటు చేస్తున్నామని బొలిశెట్టి సత్యనారాయణ తెలిపారు. వీరి వెంట హైకోర్టు న్యాయవాది సిరిపురపు ఫ్రాన్సిస్, రైతులు, రైతు కూలీల పరిరక్షణ కమిటీ నేత అనుమోలు గాంధీ తదితరులు ఉన్నారు.

చిత్రం.. అమరావతిలోని పంట పొలాలను పరిశీలిస్తున్న
సుప్రీంకోర్టు న్యాయవాది సంజయ్ పారిక్