రాష్ట్రీయం

అక్రమ కట్టడాల కూల్చివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 26: అసాధారణ వర్షాలతో రాజధానినే వరద కకావికలం చేయడంతో మున్సిపల్ మంత్రి కె తారక రామారావు చర్యలకు ఉపక్రమించారు. నీటి ప్రవాహ మార్గాల్లో అక్రమంగా వెలసిన కట్టడాలను తప్పించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలు, వరదలపై మున్సిపల్ కమిషనర్లు అప్రమత్తం కావాలని, అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్టవ్య్రాప్తంగా మున్సిపల్ కమిషనర్లు, నగర పంచాయితీ కమిషనర్లతో కెటిఆర్ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణాలపైకి వరద చొచ్చుకురావడానికి దారితీసిన కారణాలు గుర్తించాలన్నారు. ప్రతి మున్సిపాల్టీలో జల వనరులు, చెరువుల పూర్తి సమాచారాన్ని డిజిటలైజ్ చేయాలని ఆదేశించారు. ప్రతి చెరువు, నాలాల మ్యాపులు సేకరించాలని, వీటిపై ఉన్న అక్రమ నిర్మాణాలను గుర్తించాలన్నారు. నాలాల కబ్జాకు పాల్పడిన వారు ఎవ్వరైనా విడిచిపెట్టొద్దని, నిర్మాణాలు కూల్చివేయాలని ఆదేశించారు. కూల్చివేతల విషయంలో పేదోళ్లను టార్గెట్ చేయకుండా, ముందు వాణిజ్య అవసరాల కోసం లేచిన నిర్మాణాలను తప్పించాలన్నారు. అర్హులైన పేదలకు డబుల్ బెడ్‌రూమ్ నిర్మాణంలో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మూసుకుపోయిన నాలాలను ప్రక్షాళన చేయాలని, కుచించుకుపోయిన ప్రాంతాల్లో వెడెల్పు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. దీని కోసం రెవెన్యూ, సాగునీటి అధికారులతో జాయింట్ వర్కింగ్ గ్రూపులు ఏర్పాటు చేయాలని మున్సిపల్ వ్యవహారాల మంత్రి కె తారక రామారావు ఆదేశించారు.
పురపాలికల్లో శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి కూల్చివేయాలని, వర్షాల వల్ల ప్రాణనష్టం లేకుండా చూడాలన్నారు. ఒకవేళ పాత భవనాలు కూలి ప్రాణ నష్టం సంభవిస్తే మున్సిపల్ కమిషనర్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. మున్సిపల్ కమిషనర్ల పని తీరు పట్ల కెటిఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే పలుసార్లు చెప్పినా కొంతమంది విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని, ఇలాంటి వారిపై వారంలోగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇదే చివరి అవకాశమని, ప్రభుత్వ ఆదేశాలను, మున్సిపల్ యాక్ట్ ప్రకారం తమ విధులను నిర్వహించకుండా అలసత్వం ప్రదర్శిస్తే విధుల నుంచి తొలగించడం ఖాయమన్నారు. నిర్లక్ష్యం వహిస్తున్న అధికారుల జాబితా తయారు చేయాలని సిడిఎంఏను మంత్రి కెటిఆర్ ఆదేశించారు. చట్టం నిర్దేశించిన మేరకు మున్సిపల్ కమిషనర్లంతా ఉదయానే్న విధుల్లో ఉండాలని చెప్పారు. ఇకపై నిరంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పర్యవేక్షించనున్నట్టు కెటిఆర్ తెలిపారు. దీనికోసం ప్రతి మున్సిపాల్టీలో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని వారంలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ శాఖ ప్రత్యేక కార్యదర్శి యంజి గోపాల్, సిడియంఏ దానకిశోర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

చిత్రం.. నగరంలో మొదలైన ఆక్రమణల కూల్చివేతలు