రాష్ట్రీయం

కరవుకు ఇక చెల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, సెప్టెంబర్ 26: కరువుతో కునారిల్లుతున్న రాష్ట్ర ప్రజలకు వచ్చే రెండేళ్ళ వరకూ కరువు ఛాయలు కనిపించవని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆనందం వ్యక్తం చేశారు. అతివృష్టితో ఖరీఫ్ పంటలు కొంతమేర దెబ్బతిన్నా, రబీలో మరింత బలమైన పంటలతో రైతులకు మేలు కలుగుతుందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. గత మూడు రోజులుగా కురుస్తున్న అసాధారణ వర్షాలతో అతలాకుతలమైన వరద ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సోమవారం పర్యటించారు. అనంతరం జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీజన్ చివరిదశలో అనూహ్య వర్షాలతో చెరువులు, కుంటలు నిండటంతో ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తుందన్నారు. భారీగా కురిసిన వర్షాలతో కొంతమేర నష్టపోయిన మాట నిజమేనని, త్వరలోనే తేరుకోవచ్చన్నారు. గత రెండేళ్ళుగా తమ ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం కింద చెరువులను పటిష్టపర్చడంతో, భారీ వర్షాలకు రాష్టవ్య్రాప్తంగా కేవలం 122 చెరువులకే గండ్లు పడ్డాయన్నారు. మొదటి రెండు విడతల్లో మిషన్ కాకతీయ పనులకు చోటు లభించని చెరువులు మాత్రమే తెగిపోయాయని, మిగతా వాటిలో 95 శాతానికి పైగా నీటి నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల
నిర్మాణంలో గత పాలకులు అనుసరించిన ఉదాసీనత మూలంగానే లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుకోవాల్సి వచ్చిందని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అవసరమైన ప్రాజెక్టుల పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టినట్టు స్పష్టం చేశారు. పరిహారం చెల్లింపుల్లో సీమాంధ్ర పాలకులు చేసిన జాప్యమే నిర్వాసితులకు శాపంగా మారిందన్నారు. వేములవాడ పర్యటనలో మద్యమానేరు నిర్వాసితులకు ఇచ్చిన హామీని వెనుక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఇందుకు క్షమించాలని వారిని వేడుకున్నారు. డబుల్ బెడ్‌రూమ్‌ల మంజూరీకి ఇచ్చిన హామీని ఉపసంహరించుకుంటూ, ఇంతే మొత్తాన్ని వారికి చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. మరికొద్ది రోజుల వరకు రాష్ట్రంలో వర్షాలు పడే సూచనలున్నట్టు కేంద్ర వాతావరణ శాఖ సుమాచారమిచ్చిన నేపథ్యంలో మంత్రులు జిల్లా కేంద్రాల్లో, ఎంపీలు, ఎమ్మెల్యేలు నియోజకవర్గ కేంద్రాల్లో ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షించాలని సూచించారు. అధికారులతో సమన్వయంగా సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, చీఫ్ విఫ్ కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఎంపీలు బి వినోద్‌కుమార్, బాల్క సుమన్, ఎమ్మెల్యేలు పుట్ట మధుకర్, గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్, జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

చిత్రం.. మిడ్‌మానేరు వద్ద గోదావరి వరద పరిస్థితిని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తున్న కెసిఆర్