రాష్ట్రీయం

శ్రీవారిని దర్శించుకున్న రాష్టప్రతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 25: భారత ప్రథమ పౌరుడు, రాష్టప్రతి డాక్టర్ ప్రణబ్‌ముఖర్జీ సాంప్రదాయ దుస్తులు ధరించి శుక్రవారం సాయంత్రం తిరుమలలోని శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అంతకుముందు వరాహక్షేత్ర సాంప్రదాయం ప్రకారం రాష్టప్రతి, గవర్నర్, ముఖ్యమంత్రిలతో కలసి భూవరాహస్వామిని దర్శించుకుని శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ మహాద్వారం ద్వారా వేదపండితులు ఇస్తికపాళ్ ఆలయ సాంప్రదాయంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం పలికారు. ఈనేపధ్యంలో టిటిడి చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, ఇవో డాక్టర్ డి సాంబశివరావు, జెఇవో శ్రీనివాసరాజులు స్వామి తీర్థప్రసాధాలను, టిటిడి క్యాలెండర్లను, డైరీలను, స్వామి చిత్రపటాన్ని రాష్టప్రతికి అందజేశారు. ఆయన వెంట ఉన్న రాష్ట్ర గవర్నర్ ఇఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి కూడా స్వామివారి తీర్థప్రసాదాలను, చిత్రపటాలను అందజేశారు. మధ్యాహ్నం పశ్చిమగోదావరి జిల్లా అయిభీమవరంలోని టిటిడి వేదపాఠశాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న రాష్టప్రతి విజయవాడ నుండి వాయుసేన విమానంలో 2.25 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుండి ముఖ్యమంత్రి, గవర్నరులతో కలసి వేరువేరు కారులో బయలుదేరిన ఆయన 3.20 గంటలకు తిరుమల పద్మావతి అతిథిగృహానికి చేరుకున్నారు. 4.15 గంటలకు పద్మావతి అతిథిగృహం నుండి బయలుదేరి వరాహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం 4.44 గంటలకు శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించిన రాష్టప్రతి 5.25 గంటల వరకు ఆలయంలో గడిపారు. అనంతరం వకుళామాతను దర్శించుకుని సంపంగి ప్రాకారాన్ని ప్రదక్షిణగా చేసుకుని విమాన వేంకటేశ్వరుని దర్శించుకున్నారు. అనంతరం అన్నమాచార్య భాండాగారం పక్కన స్వామివారి వస్త్రాలను భద్రపరచే సబేరా గదిలోకి వెళ్లారు. ఈ సందర్భంగా శుక్రవారం స్వామి ధరించిన వస్త్రాన్ని కళ్లకు అద్దుకున్నారు. అనంతరం హుండీలో కానుకలు సమర్పించారు. అనంతరం పద్మావతి అతిథిగృహానికి చేరుకుని హైదరాబాదుకు తిరిగి పయనమయ్యారు. ఆయన వెంట మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే సుగుణమ్మ, ఎమ్మెల్సీ గౌనివాని శ్రీనివాసులు, బోర్డు సభ్యులు భానుప్రకాష్‌రెడ్డి, జిల్లా కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులున్నారు. ఇదిలావుండగా రాష్టప్రతి రాక సందర్భంగా గంటపాటు ఆలయంలోకి భక్తులను అనుమతించలేదు. కాగా రాష్టప్రతి రావడానికి గంట ముందు ఓ మతిస్థిమితం లేని భక్తుడు గొల్లమండపం, ఆంజనేయస్వామి మధ్యనున్న విశాలమైన స్థలంలో హల్‌చల్ చేసి భక్తులను ఆందోళనకు గురిచేశాడు. అయితే కొంత సమయానికి తేరుకొన్న పోలీసులు ఆ వ్యక్తిని అక్కడి నుండి పంపివేశారు. రాష్టప్రతి భద్రతా ఏర్పాట్లలో పూర్తిగా నిమగ్నమైన పోలీసు అధికారులు మతిస్థిమితం లేని వ్యక్తి ఆగడాలను గుర్తించకపోవడంతో పలు విమర్శలు వచ్చాయి.

వరాహస్వామి వారిని దర్శించుకుని వస్తున్న రాష్టప్రతి

ధ్వజస్తంభానికి నమస్కరిస్తున్న గవర్నర్ నరసింహన్, ఏపి సిఎం చంద్రబాబు