రాష్ట్రీయం

అంతర్జాతీయ ఆరోగ్య సదస్సుకు పొగాకు రైతు ప్రతినిధులను అనుమతించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 27: ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ముసాయిదా సదస్సుకు పొగాకు సాగు చేసే రైతులను కూడా అనుమతించాలని అంతర్జాతీయ పొగాకు పెంపకందార్ల సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ సదస్సు ఢిల్లీలో నవంబర్‌లో ఢిల్లీలో జరుగుతుందని, పొగాకు పంటపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకోరాదని సంఘం అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ వాన్ డెర్‌మెర్వ్ కోరారు. పొగాకు రైతు వ్యతిరేక విధానాలను తీసుకోవడం వల్ల అనేకప్రాంతాల్లో రైతుల జీవనోపాధి దెబ్బతింటుందన్నారు. పొగాకు సాగు పట్ల అవసరమైన సాంకేతిక జ్ఞానం కలిగిన వారిని చర్చల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలన్నారు. పొగాకు సాగు చేస్తున్న దేశాలు తప్పనిసరిగా తమ ప్రతినిధుల బృందం పాల్గొనేందుకు సదస్సును కోరాలన్నారు. పొగాకు విధానం నిష్పక్షపాతంగా ఉండాలన్నారు.