రాష్ట్రీయం

ఏపిఏటి పరిధి నుంచి తెలంగాణను తప్పించడంపై హైకోర్టు అసంతృప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 27: ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ పరిధి నుంచి ఏ చట్టానికి లోబడి తెలంగాణ రాష్ట్రాన్ని మినహాయించాలని కేంద్రాన్ని కోరారో తెలియచేయాలని హైకోర్టు తెలంగాణ అడ్వకేట్ జనరల్‌ను ప్రశ్నించింది. తెలంగాణకు చెందిన దాదాపు 8670 కేసులను హైకోర్టుకు బదలాయించాలని కోర్టు పేర్కొంది. పివి కృష్ణయ్య, బి కిరణ్‌కుమార్‌లు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథం, జస్టిస్ యు దుర్గాప్రసాద్‌లు విచారించారు. ట్రిబ్యునల్ పరిధి నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని మినహాయిస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌ను ఈ న్యాయవాదులు సవాలు చేశారు.
పెండింగ్ కేసులను పట్టించుకోకుండా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు వ్యవహరించిన తీరుపై హైకోర్టు ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఏజి కె రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ, రాష్ట్రప్రభుత్వం చేసిన అభ్యర్థనపై కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. హైకోర్టు జోక్యం చేసుకుని తమ దృష్టికి తీసుకురాకుండా కేంద్రాన్ని ఎలా అడుగుతారని ప్రశ్నించింది. ఇప్పటికే పెద్ద సంఖ్యలోకేసులు హైకోర్టు వద్ద పెండింగ్‌లో ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. కేంద్రం కూడా రాష్ట్రం లేఖ రాసిందని ఏపిఏటి పరిధి నుంచి తెలంగాణను ఎలా తప్పించిందని హైకోర్టు కేంద్రం తరఫున న్యాయవాది అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌ను ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఏజి జోక్యం చేసుకుని కేంద్రానికి రాష్ట్రప్రభుత్వం లేఖ రాసేముందు హైకోర్టుకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. కాగా హైకోర్టు తన సలహా ఇచ్చేవరకు ఎందుకు వేచి చూడలేదని ధర్మాసనం ఏజిని అడిగింది. ఏజి వాదనలు వినిపిస్తూ తమిళనాడులో కూడా ట్రిబ్యునల్‌ను రద్దు చేసిన తర్వాత కేసులను హైకోర్టుకు బదలాయించారని తెలిపారు. కాగా ఈ వివరాలను ఈ గురువారం కోర్టు ముందు ఉంచాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.