రాష్ట్రీయం

మిషన్ కాకతీయపై షికాగో విశ్వవిద్యాలయం అధ్యయనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 27:మిషన్ కాకతీయ పథకం గ్రామీణ ప్రాంతాల్లో మార్పులకు దోహదం చేస్తోందని, ఈ పథకం ఫలితాలపై ప్రపంచం ఆసక్తి చూపిస్తోందని షికాగో విశ్వవిద్యాలయం విద్యార్థులు అభిప్రాయం వ్యక్తం చేశారు. మిషన్ కాకతీయ పథకం గ్రామీణ ప్రాంతాల్లో చూపించిన ప్రభావం, ఈ పథకాన్ని ఇంకా మేరుగ్గా అమలు చేయాలంటే ఏం చేయాలి, పథకం అమలుకు ముందు, అమలు తరువాత గ్రామీణ ప్రాంతాల పరిస్థితి తదితర అంశాలపై అధ్యయనం చేసేందుకు గతంలో షికాగో విశ్వవిద్యాలయం, తెలంగాణ ప్రభుత్వం మధ్య ఎంఓయు కుదిరింది. రెండేళ్లపాటు అధ్యయనం చేస్తారు. షికాగో విశ్వవిద్యాలయం విద్యార్థులు తమ అధ్యయనంలో వెల్లడైన అంశాలను నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుతో మంగళవారం పంచుకున్నారు. గత ఏడాది కాలం నుంచి మిషిగాన్ విశ్వవిద్యాలయం విద్యార్థుల బృందం ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో రెండు గ్రామాలను ఎంపిక చేసుకొని మిషన్ కాకతీయ ఫలితాలపై అధ్యయనం చేస్తోంది. ప్రతిష్టాత్మక షికాగో యూనివర్సిటీ పరిశోధక విద్యార్థులు జల సౌధలో నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుతో సమావేశం అయ్యారు. పథకాన్ని సమర్ధవంతంగా ఆమలు చేసే విధంగా, ప్రజలకు మరింత మేలు కలిగే విధంగా పరిశోధన జరగాలని మంత్రి సూచించారు. చెరువుల పునరుద్ధరణకు ముందు చెరువును ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో సాగు పరిస్థితి, వరి, మొక్కజొన్న, పత్తి దితర పంటల దిగుబడి, మిషన్ కాకతీయకు పూర్వం, మిషన్ కాకతీయ తరువాత ఎలా ఉన్నాయనే అంశాలను షికాగో విద్యార్థులు అధ్యయనం చేస్తారు.