తెలంగాణ

ఫిరాయింపుదారులకే టిక్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 25: స్థానిక సంస్థల ద్వారా ఎమ్మెల్సీ స్థానాలకు జరగబోతున్న ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర సమితి తమ పార్టీ అభ్యర్థులుగా ఇతర పార్టీల నుంచి చేరిన ఫిరాయింపుదారులను, పెట్టుబడిదారులను ప్రకటించిందని టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని, జెండా మోసిన వారిని ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించలేదని ఆయన శుక్రవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. మెదక్‌లో భూపాల్ రెడ్డి, కరీంనగర్‌లో భానుప్రసాద్, వరంగల్‌లో కొండా మురళి, నల్లగొండలో టి.చిన్నపురెడ్డి, మహబూబ్‌నగర్‌లో ఎస్.జగదీశ్వర్ రెడ్డి ఫిరాయింపుదారులు, పెట్టుబడిదారులని ఆయన ఆరోపించారు. ఏ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సమితికి సరైన బలం లేకపోయినా అభ్యర్థులను బరిలోకి దించిందని, అక్కడ ఎంపిటిసి, జెడ్‌పిటిసి, కౌన్సిలర్లను కొనుగోలు చేయాలని చూస్తున్నదని రేవంత్ రెడ్డి విమర్శించారు. 6 ఎమ్మెల్సీ స్థానాలను గెలుపొంది, మరో 6 స్థానాలను కూడా అధికారాన్ని, డబ్బును ఉపయోగించి కైవసం చేసుకోవాలని అనుకుంటున్నదని ఆయన విమర్శించారు.