రాష్ట్రీయం

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, సెప్టెంబర్ 30: ఖమ్మం జిల్లాలో నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతుల పంటలను శుక్రవారం రాష్టస్థ్రాయి బృందం కూసుమంచి, తిరుమలాయపాలెం మండలాల్లో పర్యటించింది. పర్యటనలో తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల్లో రైతులు జీవ 801, శే్వత విత్తనాలు సాగు చేయగా, అధికంగా జీవ 801వల్ల రైతులు తీవ్రనష్టపోయినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అధిక దిగుబడి వస్తుందని ఆశించి పంటలు సాగు చేసిన రైతులకు పూత, కాత లేకపోవటంతో ఆందోళనలు నిర్వహించగా ప్రభుత్వం ఈ కమిటీని నియమించింది. ఖమ్మం జిల్లాలో సుమారు 12వేల ఎకరాల్లో నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోగా, ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో 11,087హెక్టార్లలో నకిలీ విత్తనాల పంట నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. 2,087మంది రైతులు ఇరు కంపెనీలకు పంట సాగు చేశారన్నారు. రైతులకు నష్టపరిహారం ఇచ్చేందుకు నకిలీ విత్తన నిర్వాహాకులు ముందుకొస్తే వారితో పరిహారం ఇప్పిస్తామన్నారు.