రాష్ట్రీయం

రూ. 15 చెల్లిస్తే 5 లక్షలకు బీమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 30: సాధారణ కార్మికులకు 15 రూపాయలు చెల్లిస్తే ఐదు లక్షల వరకూ బీమా ఇతర ప్రయోజనాలు పొందేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రన్న బీమా పథకాన్ని రూపొందించింది. ఈ పథకం ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గాంధీ జయంతి రోజున తిరుపతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమం ఆయా కలెక్టర్ల చేతుల మీదుగా ప్రారంభిస్తారు. మొత్తం కోటీ 50 లక్షల మంది కార్మికులకు చంద్రన్న బీమా పథకాన్ని వర్తింపచేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది.
కేంద్ర సంస్థల లెక్కల ప్రకారం అత్యధిక సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరిగే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను గుర్తించారు. ఇలా ప్రమాదాల్లో కుటుంబాలకు దూరం కావడమో, వికలాంగులుగా మారిపోవడమో జరుగుతోంది. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న వారు చనిపోయినా, వికలాంగుడిగా మారినా ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.
సంపాదన లేక వైద్య ఖర్చులు, ఇతర అవసరాలకు డబ్బులు లేక ఆ కుటుంబం పడే యాతన వర్ణనాతీతం. అలాంటి పరిస్థితుల్లో బాధితుల కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకోవడానికి ప్రభుత్వం చంద్రన్న బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఏడాది మేలో కార్మిక దినోత్సవం రోజున ప్రకటించిన ఈ పథకానికి కార్మికుల నుండి విస్తృత ఆదరణ లభిస్తోంది. ప్రమాదాల్లో చనిపోయిన వారికే గాక, సహజ మరణం పొందిన కార్మికులకు సైతం ఈ పథకం కింద ఆర్థిక సాయం అందుతుంది. 18 నుండి 70 ఏళ్ల వయస్సున్న కార్మికులు అంతా ఈ పథకానికి అర్హులే.
ఆమ్ ఆద్మీ బీమా యోజన, ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన పథకాలకు రాష్ట్రప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు కలిపి చంద్రన్న బీమా పథకంగా రూపొందించారు. ఈ పథకం కింద రోడ్డు ప్రమాదాల్లో మరణించినా లేదా వికలాంగులుగా మారినా ఆ కుటుంబానికి 3 లక్షల 62వేల 500 రూపాయలు అందిస్తారు. సాధారణ మరణం పొందిన కార్మికుల కుటుంబాలకు 30వేలు అందిస్తారు. 9,10 తరగతులు, ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ చదివే పిల్లలున్న కుటుంబంలో ఒకొక్కరికీ ఏడాదికి 1200 రూపాయలు చొప్పున ఇద్దరు పిల్లలకు స్కాలర్‌షిప్‌లు అందిస్తారు. చంద్రన్న బీమా పథకం ప్రకటించిన నాటి నుండి అర్హులైన కార్మికులను ఈ పథకంలో చేర్పించడానికి ఏర్పాట్లు జరిగాయి. ఇప్పటికే ఈ పథకంలో కోటి 50 లక్షల మంది చేరారు. తూర్పుగోదావరి నుండి అత్యధిక సంఖ్యలో 15 లక్షల మందికి పైగా కార్మికులు చంద్రన్న బీమాలో చేరగా, 12 లక్షలకు పైగా కార్మికులతో అనంతపురం, పశ్చిమగోదావరి, చిత్తూరు జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 9 నుండి 10 లక్షల మంది కార్మికుల జాబితాలో విశాఖ, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా జిల్లాలు ఉన్నాయి. అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు ఇల్లు కట్టించి ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
ఇందుకోసం విస్తృత ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అలాగే తాము పనిచేసే ప్రాంతాల్లోనే కార్మికులకు ఇళ్లు కట్టించి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం ప్రకటించింది.