రాష్ట్రీయం

రాజధానిలో నాలుగు రిజిస్ట్రేషన్ ఆఫీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 1: రాజధానికి భూములిచ్చిన రైతుల సౌకర్యం కోసం నాలుగు రిజిస్ట్రేషన్ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయని సిఆర్‌డిఎ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ వెల్లడించారు. శనివారం సాయంత్రం తుళ్లూరు సిఆర్‌డిఎ కార్యాలయ ఆవరణలో ఐనవోలు, అబ్బరాజుపాలెం గ్రామాల్లో భూములిచ్చిన రైతులకు ప్లాట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీ్ధర్ మాట్లాడుతూ రైతుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రపంచస్థాయి రాజధాని నగర నిర్మాణానికి కృషి జరుగుతోందని చెప్పారు. వెలగపూడిలో ప్రభుత్వ భవనాలను 7 నెలల 16 రోజుల్లో పూర్తిచేశామని, ప్రపంచ శ్రేణి ఐటి కంపెనీలకు దీటుగా అత్యాధునిక వసతులు కల్పించామన్నారు. ఈనెల 3 నుంచి ప్రభుత్వ భవనాల్లో సెక్రటేరియట్ సిబ్బంది కొలువుతీరుతారన్నారు. రైతులకు కేటాయించిన ప్లాట్లకు నిర్దేశిత కాలవ్యవధిలో రోడ్లు, డ్రైనేజీ, ఇతర వౌలిక సౌకర్యాలు కల్పిస్తామని, అంతర్జాతీయ ప్రమాణాలతో పనులు చేపడతామని అన్నారు. రైతుల భూములకు అత్యధిక ధర వచ్చే విధంగా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ తెలిపారు. అంతర్జాతీయ స్థాయి లే-అవుట్ రూపుదిద్దుకుంటుందని వివరించారు. ఐనవోలు గ్రామంలో 1066 మంది రైతులు 1056.16 ఎకరాల భూమిని భూ సమీకరణ కింద ఇచ్చారు. వీరికి 1333 రెసిడెన్షియల్ ప్లాట్లు, 912 వాణిజ్యప్లాట్లను లాటరీ విధానంలో కేటాయించారు. 22,500 చదరపు గజాల్లో 44 విల్లా ప్లాట్లను రైతులకు కేటాయించారు. అబ్బరాజుపాలెం గ్రామంలో 654 మంది రైతులు 723.3 ఎకరాల భూమిని సమీకరణకు ఇచ్చారు. వీరికి 476 రెనిడెన్షియల్ మెట్ట ప్లాట్లు, 303 రెసిడెన్షియల్ జరీబు ప్లాట్లు, 163 వాణిజ్య ప్లాట్లను పంపిణీ చేశారు.

చిత్రం.. రైతులకు ప్లాట్ల కేటాయింపు ధ్రువీకరణ పత్రాలు
అందజేస్తున్న సిఆర్‌డిఎ కమిషనర్ శ్రీ్ధర్