రాష్ట్రీయం

రైట్.. రైట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 1: వెలగపూడి సచివాలయం విజయదశమి నుంచి పూర్తిస్థాయిలో పనిచేయటం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆర్టీసీ సోమవారం నుంచి విజయవాడ నగర పరిసరాల నుంచి ప్రత్యేక మెట్రో సిటీ సర్వీసులను నడుపనున్నది. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి ఉదయం 9 నుంచి ప్రతి ఐదు నిమిషాలకు నాలుగు సర్వీసులు, కంకిపాడు నుంచి ఉదయం 8.10లకు, నిడమానూరు నుంచి 8.25కు, ఇబ్రహీంపట్నం నుంచి 8.10కి, కృష్ణలంక వారధి నుంచి 9.05 నుంచి ప్రతి ఐదు నిమిషాలకు నాలుగు సర్వీసులు, తాడేపల్లి ఉండవల్లి సెంటర్ నుంచి ప్రతి ఐదు నిమిషాలకు నాలుగు సర్వీసులు సచివాలయానికి నడవనున్నాయి. తిరుగు ప్రయాణంలో సచివాలయం నుంచి సాయంత్రం పిఎన్‌బి బస్టేషన్, కంకిపాడు, నిడమానూరు, ఇబ్రహీంపట్నంకు బస్సులు నడుస్తాయి.