రాష్ట్రీయం

ఇస్రోతో ముందడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 1: ఆంధ్రప్రదేశ్‌లో ‘సెంటర్ ఫర్ స్పేస్ ఇన్నోవేషన్’ సంస్థను ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూత్రప్రాయంగా అంగీకరించారు. త్వరలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి, ఇస్రో మధ్య అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ఆయన ఇస్రో అధికారులకు తెలిపారు. విజయవాడ పోలీస్ కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్‌లో ముఖ్యమంత్రితో ఇస్రో అధికారులు, రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు భేటీ అయ్యారు. రాష్ట్ర అవసరాలకు తగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇస్రో అందించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇస్రోకు కావాల్సిన
సదుపాయాలు అన్నీ కల్పిస్తామని, కచ్చితమైన వాతావరణ వ్యవస్థను ఏర్పాటు చేయమని సిఎం ఇస్రో అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా ఇస్రో అధికారులు ఇస్రో సాధించిన ప్రగతి గురించి ముఖ్యమంత్రికి వివరించారు. 24 గంటల ముందే వాతావరణాన్ని 70 శాతం కచ్చితత్వంతో అంచనా వేయగలమని ఇస్రో అధికారులు వెల్లడించారు. 48 గంటల ముందైతే 60 శాతం కచ్చితత్వంతో వాతావరణ సూచన చేసే అవకాశం ఉందన్నారు. నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 15వరకు ఉంటాయని ముందున్న అంచనా. కానీ అది మరో వారం రోజులపాటు విస్తరించే అవకాశం ఉందని ఇస్రో శాస్తవ్రేత్తలు సిఎంకు తెలిపారు. ఈ సమావేశంలో సిఎంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శులు, అధికారులు, ఇస్రో శాస్తవ్రేత్తలు, విశ్వవిద్యాలయాల వైస్‌ఛాన్సలర్లు పాల్గొన్నారు.

చిత్రం.. ఇస్రో అధికారులు, యూనివర్సిటీల విసిలతో సమావేశంలో మాట్లాడుతున్న చంద్రబాబు