రాష్ట్రీయం

ఐదేళ్లు పన్ను రాయితీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 1: తెలంగాణలోని తొమ్మిది జిల్లాల్లో పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహకంగా కేంద్రం పన్ను రాయితీ ప్రకటించింది. హైదరాబాద్ వినా మిగిలిన తొమ్మిది జిల్లాలు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో పన్ను రాయితీలు ప్రకటించింది. ఏప్రిల్ 1, 2015 నుంచి మార్చి 2020 వరకు ఐదేళ్లపాటు పన్ను రాయితీలు వర్తిస్తాయి. పరిశ్రమలకు 15శాతం రాయితీతో పాటు 15శాతం అదనపు తరుగుదల అవకాశం కల్పిస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సిబిడిటి) ఉత్తర్వులు జారీ చేసింది. వెనుకబడిన జిల్లాల్లో పారిశ్రామిక కార్యకలాపాలు ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 32 ఏడి 32(1)ల క్రింద ప్రత్యేక ప్రయోజనాలు కలిగిస్తున్నది. దీనికి సంబంధించి పన్ను రాయితీలు పొందే రాష్ట్రాల జాబితాలో తెలంగాణతో పాటు పశ్చిమ బెంగాల్, బీహార్, ఆంధ్ర ఉన్నాయి. తెలంగాణ, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు సంబంధించి వెనుకబడిన జిల్లాల్లో పరిశ్రమలకు పన్ను రాయితీ, అదనపు పెట్టుబడి రాయితీ కల్పిస్తూ ఈ ఏడాది జూలై 20న కేంద్రం ఉత్తర్వులు
జారీ చేసింది. దీని ప్రకారం హైదరాబాద్ వినా తెలంగాణలోని మిగిలిన తొమ్మిది జిల్లాల్లో పరిశ్రమలు స్థాపించే వారికి రాయితీలు లభిస్తాయి. తెలంగాణ, పశ్చిమ బెంగాల్, బీహార్‌లతో పాటే ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు జిల్లాలకు పన్ను రాయితీ కల్పించాలని ఈ ఏడాది జూలైలో కేంద్రం నిర్ణయించింది. 2015 ఏప్రిల్ 1 నుంచి 2020 మార్చి 31 వరకు ఎవరైనా పరిశ్రమలు ఏర్పాటు చేస్తే దీనికోసం వినియోగించిన ప్లాంటు, మిషనరీ కోసం చేసిన ఖర్చుపై 15శాతం అదనపు పెట్టుబడి రాయితీ లభిస్తుంది. 15శాతం అదనపు తరుగుదల ప్రయోజనం లభిస్తుంది. ఆదాయపు పన్ను చట్టం కింద ఇప్పటికే లభిస్తున్న రాయితీలకు ఇవి అదనంగా లభిస్తాయని అధికార వర్గాలు తెలిపాయి.