రాష్ట్రీయం

ఇదీ.. కొత్త ప్రక్రియ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 1: ఇంకో పది రోజుల్లో కొత్త జిల్లాలు ఉనికిలోకి రానున్నాయి. పాత జిల్లాల చరిత్ర దాదాపు ముగిసినట్టే. జిల్లా, రాష్టస్థ్రాయి యంత్రాంగం మొత్తం కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో బిజీగా ఉండటంతో ఇతర కార్యకలాపాలు సాగడం లేదు. కొత్త జిల్లాల్లో తొలిరోజు నుంచే పాలన ఎలా ఉండాలన్న అంశంపై సిఎస్ రాజీవ్ శర్మ శనివారం వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై మార్గనిర్దేశం చేశారు.
ఇక కొత్త జిల్లాలపై జిల్లాలవారీ తెరాస నేతలతో సిఎం కెసిఆర్ ఆదివారం నుంచీ సమావేశం కానున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తెరాస ముఖ్య నేతలతో ఆది, సోమవారాల్లో సమావేశం కానున్నారు. కొన్ని జిల్లాల్లో కొత్త జిల్లాల ఏర్పాటుపై జరుగుతున్న ఆందోళలను దృష్టిలో పెట్టుకుని ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఏవిధంగా జరిగిందో సమావేశాల్లో వివరిస్తారు. గద్వాల, సిరిసిల్ల, జనగామలను జిల్లాలు చేయాలని పెద్దఎత్తున స్థానికంగా ప్రజాందోళనలు చేసినా, ఏ పరిస్థితుల్లో ఈ మూడింటిని కొత్త జిల్లాలు చేయలేకపోతున్నరో సిఎం వివరిస్తారు. సిఎం క్యాంపు కార్యాలయంలో జరిగే సమావేశానికి ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్‌లు, డిసిఎంఎస్, డిసిసిబి
చైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులను ఆహ్వానించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై జిల్లా నేతలతో సిఎం చర్చిస్తారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పాటు జరగాలని ముఖ్యమంత్రి అన్నారు. దీనిలో భాగంగానే క్షేత్రస్థాయిలోని నేతలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తెలుసుకుంటారు.
పాలమూరుతో శ్రీకారం
రెండు రోజులపాటు జరిగే సమావేశం ఆదివారం ఉదయం 11 గంటలకు మహబూబ్‌నగర్ జిల్లాతో ప్రారంభిస్తున్నారు. గద్వాలను జిల్లా చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ ఆందోళన చేస్తున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు మహబూబ్‌నగర్ జిల్లా నేతలతో సిఎం సమావేశమవుతారు. మధ్యాహ్నాం 12 గంటలకు నల్లగొండ, ఒంటిగంటకు రంగారెడ్డి, మధ్యాహ్నాం మూడు గంటలకు నిజామాబాద్ జిల్లా, నాలుగు గంటలకు మెదక్ జిల్లా నేతలతో సిఎం సమావేశమవుతారు. సోమవారం ఉదయం 11 గంటలకు కరీంనగర్ జిల్లా, 12 గంటలకు వరంగల్, మధ్యాహ్నాం ఒంటి గంటకు ఆదిలాబాద్, మూడు గంటలకు ఖమ్మం, నాలుగు గంటలకు హైదరాబాద్ జిల్లా నేతలతో సమావేశం కానున్నారు.
పాత జిల్లాలోనే ఒరిజినల్ రికార్డులు
మరో పది రోజుల్లో ఉనికిలోకి రానున్న కొత్త జిల్లాలు ఏవిధంగా పని చేయాలనే దానిపై ఉన్నతాధికారులతో సిఎస్ రాజీవ్ శర్మ శనివారం సమావేశమయ్యారు. ప్రస్తుత జిల్లాల్లోవున్న ఒరిజినల్ రికార్డులను ఆయా జిల్లాల్లోనే రికార్డు రూమ్‌లో భద్రపర్చాలని సిఎస్ అధికారులకు సూచించారు. కొత్త జిల్లాలకు అవసరమైన రికార్డులను స్కానింగ్ చేసి ఇవ్వాలన్నారు. వివిధ శాఖల ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులతో సిఎస్ సమావేశమయ్యారు. జిల్లాల ఏర్పాటైన తొలిరోజు నుంచే పాలన ప్రారంభం కావాల్సి ఉందన్నారు. తొలిరోజు నుంచే ప్రతి విభాగం తమ కార్యాలయాలు ప్రారంభించి కార్యకలాపాలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తమ శాఖలకు జిల్లాల్లో అవసరమైన వసతి ఏర్పాటు చేసుకోవాలని, ఈ విషయమై ఉన్నతాధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. జిల్లాల్లో పని చేసే సిబ్బందిని సర్దుబాటు చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లలో కొత్త పోస్టులు మంజూరు చేయనున్నట్టు చెప్పారు. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ప్రదీప్‌చంద్ర, ఎస్పీ సింగ్, రంజీవ్ ఆర్ ఆచార్య, యస్‌కె జోషి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. వివిధ శాఖల అధిపతులతో కొత్త జిల్లాలపై చర్చిస్తున్న సిఎస్ రాజీవ్ శర్మ