రాష్ట్రీయం

శ్రీశైలం ప్రాజెక్టుకు సాయుధ భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, అక్టోబర్ 1: శ్రీశైలం ప్రాజెక్టుకు సాయుధ పోలీసులతో కూడిన భద్రత ఏర్పాటు చేశారు. ఉగ్రదాడులు జరుగవచ్చన్న ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో రాష్టవ్య్రాప్తంగా కీలకమైన ప్రాంతాల్లో భద్రత పెంచాలని ఏపి సిఎం చంద్రబాబునాయుడు శుక్రవారం ఆదేశాలు జారీ చేసిన సంగతి విదితమే. ఈ మేరకు శనివారం కర్నూలు నుంచి డిఎస్పీ మురళీకృష్ణ ప్రత్యేక అధికారిగా శ్రీశైలం చేరుకుని ప్రాజెక్టు వద్ద బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రాజెక్టు రక్షణకు అవసరమైన చోట్ల సాయుధ పోలీసులను నియమించారు. ఇప్పటికే ప్రత్యేక రక్షకదళం (ఎస్‌పిఎఫ్) భద్రతలో ఉన్న ప్రాజెక్టుకు అదనంగా ప్రత్యేక పోలీసు భద్రత తోడైంది. కాగా శ్రీశైలం ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లపైకి పర్యాటకులకు తాత్కాలికంగా అనుమతి రద్దుచేశారు. ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు అందేంత వరకు పర్యాటకులు ప్రాజెక్టుపైకి వెళ్లడానికి వీలు కాదని అధికారులు స్పష్టం చేశారు. కేవలం విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందిని మాత్రమే అనుమతిస్తున్నారు.

చిత్రం.. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద భద్రతను పర్యవేక్షిస్తున్న డిఎస్పీ మురళీకృష్ణ