రాష్ట్రీయం

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, అక్టోబర్ 1: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 3 నుంచి 11వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఇందుకోసం అక్టోబర్ 2వ తేదీ రాత్రి 7 నుంచి 8 గంటల నడుమ అంకురార్పణ నిర్వహిస్తారు. అక్టోబర్ 3న ఉదయం విశ్వరూప దర్శనం, సాయంత్రం 6.15 నుంచి 6.30 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం జరుగనుంది. ఇందులో భాగంగా స్వామివారి సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనుల వారు ఆలయానికి నైరుతి మూలలో ఉన్న వసంత మండపానికి ఊరేగింపుగా వెళ్తారు. అక్కడ పుట్టమన్నును సేకరించి భూమాతకు ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ మన్నులో నవధాన్యాలను నిక్షిప్తంచేస్తారు. అదేరోజు రాత్రి బ్రహ్మోత్సవాలకు నవధాన్యాలతో అంకురార్పణ జరుగుతుంది. అంకురార్పణ ఘట్టం తరువాత రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు. అక్టోబర్ 3నుంచి స్వామివారికి రోజుకో వాహన సేవ అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇందులో ప్రధానంగా ఐదోరోజు గరుడోత్సవం జరుగుతుంది. అక్టోబర్ 3న రాత్రి పెద్దశేషవాహనం, 4న ఉదయం చిన్నశేషవాహనం, రాత్రి హంసవాహనం, 5న ఉదయం సింహవాహనం, రాత్రి హంసవాహనం, 6న ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి ముత్యపుపందిరి వాహనం, 7న ఉదయం మోహినీ అవతారం రాత్రి 7.30 నుంచి 1గంటవరకు గరుడ వాహన సేవ , 8న ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం 5నుంచి 7 గంటల వరకు స్వర్ణరథోత్సవం, రాత్రి గజవాహనం. 9న ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం, 10న ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి అశ్వవాహనం, 11న ఉదయం 6గంటలకు చక్రస్నానం నిర్వహిస్తారు. రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
రేపు తిరుమలకు సిఎం రాక
కాగా బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు జరిగే గరుడోత్సవం సందర్భంగా స్వామివారికి అలంకరించే పట్టువస్త్రాలను ప్రభుత్వం తరపున సమర్పించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రేపు తిరుమలకు రానున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు సిఎం రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. సాయంత్రం 6.15 గంటల నుంచి 7.30 గంటల మధ్యన శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి తిరుగు ప్రయాణమవుతారు.