రాష్ట్రీయం

వేద పాఠశాలల నిర్వహణకు మార్గదర్శకాలు ఖరారు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 1: ఆంధ్రప్రదేశ్‌లో అన్ని వేదపాఠశాలలు, వేద వాంజ్ఞయం, వైదిక ప్రక్రియలను బోధించే సంస్థలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని హైకోర్టు రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. దీని నిమిత్తం దేవాదాయ చట్టానికి సవరణలు తేవాలని లేదా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఒక సొసైటీని ఏర్పాటు చేయాలని కోరింది. ఒకే సిలబస్‌ను రూపొందించి, అర్హులైన బోధనా సిబ్బందిని నియమించి, పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏ రామలింగేశ్వరరావు ఆదేశించారు.
విజయవాడ శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయంలో పనిచేస్తున్న పున్నపల్లి వెంకటసుబ్రహ్మణ్య శాస్ర్తీని టర్మినేట్ చేయడం అక్రమమని, వెంటనే 30 రోజుల్లోగా వేదపాఠశాలలో నియమించాలని హైకోర్టు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ను ఆదేశించింది. తన టర్మినేషన్ అక్రమమని ప్రకటించాలని కోరుతూ వెంకట సుబ్రహ్మణ్య శాస్ర్తీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించి ఈ తీర్పు ఇచ్చింది. ఈ సందర్భంగా హైకోర్టు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వం, దేవాలయ పరిపాలన శాఖ పరిధిలో వేదపాఠశాలలు ఉన్నాయని గమనించినట్లు కోర్టు పేర్కొంది. ఎటువంటి విధి విధానాలు లేకుండా దేవాలయ పరిపాలన శాఖ వేద పాఠశాలలను నిర్వహిస్తోంది. ఈ పాఠశాలల నిర్వహణకు సంబంధించి ఎటువంటి విధి విధానాలు లేవు.
సమర్థతతో వేదపాఠశాలలను నిర్వహించని పక్షంలో అవకతవకలు జరిగే అవకాశం ఉందని, ప్రావీణ్యత లోపిస్తుందని, వైదిక కర్మలను సక్రమంగా నిర్వహించే పండితులు తయారు కాలేరని కోర్టు వ్యాఖ్యానించింది. బ్యూరోక్రాట్లకు వీటి నిర్వహణను వదిలేయడం సరికాదని కోర్టు పేర్కొంది.
భక్తులు ఇచ్చే విరాళాలతో నడుస్తున్న వేద పాఠశాలలకు సరైన ఆలనాపాలనా లేకపోతే ఎలా అని, విధి విధానాలను ఖరారు చేయాల్సిన అవసరం ఉందని హైకోర్టు పేర్కొంది. కేంద్ర మానవవనరుల శాఖ సంస్కృత భాష విషయంలో వచ్చే పదేళ్లలో సాధించాల్సిన లక్ష్యాలు, రోడ్ మ్యాప్‌ను ఖరారు చేసిందని, దీనిని పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.