రాష్ట్రీయం

ఆలయాల సంరక్షణతో ధర్మ రక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ఖైరతాబాద్, అక్టోబర్ 1: భారతీయ హైందవ దేవాలయాలు ఆధ్యాత్మిక నిలయాలు మాత్రమే కాదు, విజ్ఞాన కేంద్రాలని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి మురళీధర్‌రావు అన్నారు. శనివారం బంజారాహిల్స్ ప్రసాద్ ల్యాబ్స్‌లో గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్, సేవ్ టెంపుల్స్ ఆధ్వర్యంలో దేవాలయాల పరిరక్షణపై డాక్యుమెంటరీ చిత్ర ప్రదర్శన, బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా జస్టిస్ గ్రంధి భవాని ప్రసాద్, ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ, బ్రహ్మకుమారీ ప్రచారకర్త మంజు బెహన్, సినీ రంగస్థల నట శిక్షకుడు దీక్షిత్ తదితరులు హాజరయ్యారు.
ప్రదర్శనలోఎంపికైన ఉత్తమ డాక్యుమెంటరీల నిర్మాతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా మురళీధర్‌రావు మాట్లాడుతూ భారతదేశ వైభవాన్ని ప్రపంచానికి చాటినవి ఆనాటి మన దేవాలయాలేనన్నారు. వేల సంవత్సరాల క్రితమే ఎంతో ఖర్చుతో అద్భుతమైన కళాఖండాలతో దేవాలయాలను నిర్మించారని చెప్పారు. అలాంటి దేవాలయాలకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్, సేవ్ టెంపుల్స్ చేస్తున్న కృషి ఎనలేనిదన్నారు. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చినా ఇక్కడి దేవాలయాలకు స్వాతంత్య్రం రాలేదన్న భావన హిందువులను వెంటాడుతోందని అన్నారు. దానిని సరిచేసేందుకు మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
హిందూ ధర్మంపై దాడిచేసే వారికి కనువిప్పు కలిగేలా అద్భుతమైన డాక్యుమెంటరీలు తీయాల్సి ఉందని ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ అన్నారు. భారతీయ సనాతన ధర్మాన్ని, దేవాలయాలను రక్షించేందుకు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్, సేవ్ టెంపుల్స్ అద్భుతమైన కృషి చేస్తున్నాయని హిందూత్వవాదులు భావిస్తున్నారన్నారు. వారి అంచనాలకు అనుగుణంగా డాక్యుమెంటరీలు వచ్చినప్పుడే సమాజంలో మార్పు తీసుకురాగలమన్నారు. దేశంలో ప్రతి గ్రామంలో దేవాలయాలు ఉన్నాయని, ఆ దేవాలయాల డాక్యుమెంటరీలు తీస్తే మన సంకల్పం త్వరగా నెరవేరుతుందని సూచించారు. ప్రతిభా పాటవాలు ఉండి, సంపాదించే అవకాశాన్ని సైతం వదులుకుని హైందవ ధర్మ రక్షణ కోసం గజల్ శ్రీనివాస్ చేస్తున్న కృషి అద్వితీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాఘవేంద్ర ప్రసాద్, సినీ దర్శక నిర్మాత అల్లాణి శ్రీ్ధర్, మధుర మ్యూజిక్ కంపెనీ చైర్మన్ మధుర శ్రీ్ధర్, నటీమణులు కవిత, మధుశాలిని తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. శనివారం హైదరాబాద్‌లో జరిగిన దేవాలయాల పరిరక్షణపై డాక్యుమెంటరీ చిత్ర ప్రదర్శన,
బహుమతుల కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తున్న ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ. వేదికపై బిజెపి నేత మురళీధర్‌రావు, రాఘవేంద్ర ప్రసాద్, అల్లాణి శ్రీధర్, గజల్ శ్రీనివాస్ ఉన్నారు.