రాష్ట్రీయం

పండగ కళ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 25: తెలుగు రాష్ట్రాలు ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్నాయి. వారం రోజులుగా వివిధ మతాలకు చెందిన పండుగలు వరుసగా రావడంతో అన్ని మతాలవారూ ఉత్సాహంగా, ఉల్లాసంగా పండుగలు నిర్వహించుకుంటున్నారు. హిందువులు పవిత్రంగా భావించే ముక్కోటి ఏకాదశితో ఆధ్యాత్మిక వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ముస్లింలు పవిత్ర దినంగా జరుపుకునే మహ్మద్ ప్రవక్త జన్మదినోత్సవం మిలాద్-ఉన్-నబీ పండుగ వచ్చింది. దీని తర్వాత క్రైస్తవులకు పెద్ద పండుగ అయిన క్రిస్మన్ వచ్చింది. హిందువులకు ముక్కోటి ఏకాదశి, ముస్లింలకు మిలాద్-ఉన్-నబీ, క్రైస్తవులకు క్రిస్మన్ పండుగ అన్ని వరుసగా రావడంతో రాష్ట్రంలో దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మిన్నంటాయి. దీనికి తోడు మరోవైపు కనీవినీ ఎరగని రీతిలో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు నిర్వహిస్తున్న అయుత మహా చండీయాగానికి వివిధ రాష్ట్రాల నుంచి భక్తజనం పోటెత్తుతోంది. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ మొదలుకుని వివిధ రాష్ట్రాలకు చెందిన గవర్నర్లు, ముఖ్యమంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, బడా పారిశ్రామికవేత్తలు, వివిధ మఠాలకు చెందిన స్వాములు రాష్ట్రానికి తరలి వస్తుండటంతో భక్తజనమంతా చండీయాగం బాట పట్టింది. చండీయాగాన్ని నాలుగేళ్ల కిందట కర్నాటకలోని శృంగేరిలో పీఠం మాత్రమే నిర్వహించినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. రాష్ట్రంలో మాత్రం అయుత చండీయాగం జరగడం ఇదే ప్రథమం కావడంతో ఆ వేడుకను వీక్షించడానికి జనం తండోపతండాలుగా మెదక్ జిల్లా ఎర్రవెల్లికి తరలివెడుతున్నారు. అయ్యప్ప దీక్షల సంగతి సరేసరి. ఎక్కడ చూసినా అయ్యప్ప మాలలతో భక్తుల సందడి ఉండనే ఉంది.

క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని శుక్రవారం
సికిందరాబాద్‌లోని ఒక చర్చిలో ప్రార్థనలు చేస్తున్న క్రైస్తవులు