రాష్ట్రీయం

సంక్రాంతికి అన్ని రైళ్లలో రిజర్వేషన్ ఫుల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 2: వచ్చే సంక్రాంతికి ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గోదావరి జిల్లాల్లో కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, భీమవరం, నర్సాపురం లేదా ప్రకాశం, నెల్లూరు వైపు రైళ్లలో ప్రయాణం చేద్దామమనుకుంటే నిరాశే. ఆన్‌లైన్‌లో లేదా రిజర్వేషన్ కౌంటర్లలకు వెళ్లి టిక్కెట్ బుక్ చేద్దామంటే చాంతాడంత వెయిటింగ్ లిస్టు దర్శనిమిస్తుంది. వచ్చే సంక్రాంతికి అన్ని రైళ్లలో అన్ని తరగతుల్లో రిజర్వేషన్ భర్తీ అయ్యాయి. కొన్ని రైళ్లకైతే టిక్కెట్లు కూడా ఇవ్వడంలేదు. రిగ్రెట్ అని వస్తుంది. వచ్చే ఏడాది జనవరి 13,14, 15 తేదీల్లో సంక్రాంతి సంబరాలు ఆంధ్రాలో వైభవంగా జరుగుతాయన్న విషయం విదితమే. రైళ్లలో టిక్కెట్లను 120 రోజుల ముందు బుక్ చేసుకోవచ్చు. దీంతో జనవరి నెలలో 10వ తేదీ నుంచి సంక్రాంతికి తమ ఊళ్లకు వెళ్లాలనుకునే వారికి వెయిటింగ్ లిస్టు వెక్కిరిస్తుంది. అన్ని రైళ్లలో నాలుగు నెలల ముందే టిక్కెట్లు బుక్ అయ్యాయి. జనవరి 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి విజయవాడ, విశాఖ, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, భీమవరం వెళ్లాలంటే టిక్కెట్లు దొరకవు. దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్ల ప్రకటన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. అలాగే వచ్చేటప్పుడు జనవరి 15, 16,17, 18 తేదీల్లో స్లీపర్ క్లాస్, త్రీటైర్, టూటైర్, ఫస్ట్‌క్లాస్ ఏసి కోచ్‌లు బుక్కయ్యాయి. విశాఖకు వెళ్లే ఆంధ్ర ఫేవరేట్ ట్రైన్ గోదావరి ఎక్స్‌ప్రెస్ స్లీపర్ క్లాస్‌లో జనవరి 10న వెయిటింగ్ లిస్టు107, 11వ తేదీన 230, 12న 397, 13న 232 ఉంది. త్రీటైర్, టూ టైర్ ఏసి పరిస్ధితి అంతే. విశాఖ గరీబ్ రథ, విశాఖ ఎక్స్‌ప్రెస్, ఫలక్‌నామా, ఎల్‌టిటి విశాఖ, దురంతో, నాగావళి పరిస్థితి కూడా అంతే.
గోదావరి జిల్లాలు అమితంగా ఇష్టపడే గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో అన్ని తరగతుల్లో బెర్తులు ఫుల్ అయ్యాయి. స్లీపర్ క్లాస్‌లో వెయిటింగ్ లిస్టు జనవరి 10న 109, 11న 287, 13న రిగ్రెట్, 13న 318 వెయిటింగ్ లిస్టు ఉంది. సికింద్రాబాద్-కాకినాడ వయా భీమవరం కోకనాడ ఏసి ఎక్స్‌ప్రెస్‌లో కూడా అన్ని బెర్తులు నిండిపోయాయి. జనవరి 14న సంక్రాంతి పండగ రోజు ఆంధ్రా నుంచి హైదరాబాద్‌కు వచ్చే అన్ని రైళ్లలో బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఈ సారి సంక్రాంతి శనివారం వచ్చింది. ఆదివారం కనుమ పండగ. పైగా పండగ రోజు వచ్చేందుకు ఎవరూ ఇష్టపడరు. మర్నాడు సోమవారం 15వ తేదీ నుంచి మాత్రం రైళ్లు కిటకిటలాడుతున్నాయి. జనవరి 15,16, 17, 18వ తేదీ వరకు విశాఖ, కాకినాడ, రాజమండ్రి వైపు నుంచి హైదరాబాద్‌కు, బెంగళూరు, చెన్నైకు వెళ్లే అన్ని రైళ్లలో బెర్తులు ఖాళీగా లేవు. దీంతో ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, ఇటు నెల్లూరు, తిరుపతి, బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు ప్రకటన వెలువడడమే తరువాయి, నిమిషాల్లో టిక్కెట్లు బుక్ అవుతాయని రైల్వే వర్గాలు తెలిపాయి.