ఆంధ్రప్రదేశ్‌

విస్తరణ ఎప్పుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 2: అంతా ఎదురుచూస్తున్న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ముహుర్తం మారుతోందా? ముందుగా ఆశించినట్లు దసరాకు జరగదా? ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశం తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహచర నేతలతో చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే ఈ అనుమానాలు బలపడుతున్నాయి. కేబినెట్ భేటీ అనంతరం చంద్రబాబు యథావిధిగా పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. అందులో మున్సిపల్ ఎన్నికలు చర్చకు వచ్చాయి. డిసెంబర్‌లో ఎన్నికలు వస్తాయని, మీరంతా జాగ్రత్తగా పనిచేసి, పార్టీని గెలిపించే బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. దాంతో అక్కడ ఉన్న మంత్రులు, పార్టీ సీనియర్లకూ దసరాకు మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఉండబోదన్న సంకేతాలు స్పష్టమయ్యాయి. దీంతో పదవులపై ఆశలు పెట్టుకున్న వారు నిరాశ చెందారు. స్థానిక ఎన్నికల్లో గెలిచిన వారి సత్తా ప్రాతిపదికగా కూడికలు తీసివేతలుంటాయని బాబు స్పష్టం చేయడంతో, దసరాకు ముహూర్తం ఉండదని తేలిపోయింది. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగితే రావెల, పత్తిపాటి, శిద్దా రాఘవరావు, మృణాళిని, రవీందర్ వంటి మంత్రులను తొలగిస్తారన్న ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. కాగా, పునర్వ్యవస్థీకరణకు-స్థానిక సంస్థల ఫలితాలకు ముడిపెట్టడంపై పార్టీలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాబు గతంలో కూడా ఇదేవిధంగా సత్వర నిర్ణయాలు తీసుకోకుండా ఏదో ఒక సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని, కాలం గడిపి పార్టీలో అసంతృప్తి కొనితెచ్చుకున్న వైనాన్ని గుర్తు చేస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ పాటి ధైర్యం కూడా తమ అధినేత చేయలేకపోతున్నారన్న వ్యాఖ్యలు పార్టీ సీనియర్ల నుంచి వినిపిస్తున్నాయి. కేసీఆర్ తన మంత్రివర్గంలో ఉన్న నాలుగు ఖాళీలను అనుకున్న వెంటనే భర్తీ చేశారని, ఇప్పుడు ఏపిలో ఖాళీగా ఉన్న శాఖలను భర్తీ చేయకుండా పండుగలు, ఎన్నికలంటూ కాలయాపన చేయడం వల్ల ఎవరికి నష్టమని ప్రశ్నిస్తున్నారు. ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికల ఫలితాల తర్వాత మార్చిలో బడ్జెట్ వస్తుందని, బడ్జెట్ తర్వాత కేబినెట్ విస్తరిస్తామని చెప్పినా ఆశ్చర్యపోవలసిన పనిలేదంటున్నారు.
‘సకాలంలో చేయాల్సిన పని చేయనందుకే అప్పుడు మేం దెబ్బతిన్నాం. ఇప్పుడూ అదే పరిస్థితి కొనసాగుతోంది. కేసీఆర్ ఈ విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోగా, మా సార్ ఇంకా నెలలకు నెలలు వాయిదాలు వేస్తూపోతున్నారు. అప్పటికి ఎన్నికలు ఏడాది ముందుకొస్తాయి. అప్పుడు ఇచ్చినా ఎవరికీ తృప్తి ఉండదు. ఉన్న ఖాళీలు భర్తీ చేసుకోకుండా కాలయాపన చేయడం వల్ల పాలన దెబ్బతింటుంది. విస్తరణ చేస్తే పార్టీలో గొడవలొస్తాయని భయపడుతున్నట్లు సంకేతాలు వెళ్లడం మంచిదికాదు. ఇప్పటికే అలాంటి భావన ఉంది. ఇప్పుడు ప్రతిపక్షం కూడా బలహీనంగా ఉంది. పార్టీలో సార్‌ను వ్యతిరేకించే ధైర్యం కూడా ఎవరికీ లేదు. కాబట్టి నాకు తెలిసి బాబు ఎవరికీ భయపడాల్సిన పనిలేద’ని ఓ మాజీ మంత్రి వ్యాఖ్యానించారు.
ఇదిలాఉండగా, లోకేష్‌కు మంత్రి పదవి ఇవ్వాలన్న ఒత్తిడి పెరుగుతున్నందున, బాబు అనూహ్య నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యం లేదని మరికొందరు సీనియర్లు విశే్లషిస్తున్నారు. ‘లోకేష్‌కు మంత్రి ఇవ్వాలన్న ఒత్తిడి ఇంటా బయటా తీవ్రంగా ఉంది. కాబట్టి మాకు తెలిసి ఫిబ్రవరి వరకూ ఆగకపోవచ్చు. అనుకున్న సమయానికే పునర్వ్యవస్థీకరణ ఉండవచ్చు. కేసీఆర్‌లా కాకుండా తాను భయపడుతున్నానన్న సంకేతాలు వెళితే బాబు తన నిర్ణయాన్ని మార్చుకున్నా ఆశ్చర్యపోవలసిన పనిలేద’ని పార్టీలో కీలక నేత ఒకరు వ్యాఖ్యానించారు. కేసీఆర్‌లా కాకుండా విస్తరణకు బాబు భయపడుతున్నారన్న ప్రచార ప్రభావం తీవ్రంగా ఉంటే దసరాకే చేస్తారని, లేకపోతే మునిసిపోల్స్ తర్వాతనే ఉంటుందని పార్టీ వర్గాలు విశే్లషిస్తున్నాయి.