రాష్ట్రీయం

డిసెంబర్‌లో ఏపి శీతాకాల అసెంబ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 3: వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ ప్రాంగణం ఆరో బ్లాక్‌లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి భవనాల నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ 15లోపు పూర్తిచేసి చివరివారంలో శీతాకాల సమావేశాలు నిర్వహించబోతున్నామని ఏపి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. సచివాలయం పూర్తిస్థాయిలో పనిచేయటం ఆరంభించిన నేపథ్యంలో సోమవారం ఆయన ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, శాసనమండలి చైర్మన్ చక్రపాణి, ఉపాధ్యక్షులు సతీష్‌రెడ్డి, రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, డిజిపి నండూరి సాంబశివరావు, స్థానిక శాసనసభ్యులు శ్రావణ్‌కుమార్, ముఖ్య అధికారులతో కలిసి ఆరో బ్లాక్‌లో జరుగుతున్న పనులను పరిశీలించారు.అనంతరం కోడెల విలేఖర్లతో మాట్లాడుతూ ఆరో బ్లాక్‌లో స్పీకర్, డెప్యూటీ స్పీకర్ల చాంబర్లు, సభాపక్ష నేత, ప్రతిపక్ష నేత, చీఫ్ విప్, విప్‌ల చాంబర్లు, మంత్రుల చాంబర్లు, క్యాంటీన్, లైబ్రరీ, సౌండ్ సిస్టం, టెలికాస్ట్, మీడియా పాయింట్, చుట్టూ ప్రహరీ నిర్మాణం వంటి వౌలిక సదుపాయాల కల్పనపై తామంతా కలిసి ఇంజనీర్లు, కాంట్రాక్ట్ సంస్థకు తగిన సూచనలు, సలహాలు అందించామని చెప్పారు. శాసనసభ, సచివాలయానికి సంబంధించి 300 మంది సిబ్బంది ఉండగా 15వ తేదీ తర్వాత వారంతా ఇక్కడకు తరలివస్తారని తెలిపారు. హైదారాబాద్‌లోని శాసనసభ భవనాలను, అలాగే ఖాళీ అయిన సచివాలయం, క్వార్టర్లను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించే విషయమై తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు, తర్వాత రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గత సమావేశాల్లో వైకాపా సభ్యుల అనుచిత ప్రవర్తనపై ప్రివిలేజెస్ కమిటీ పరిశీలిస్తోందని తెలిపారు. సభకు వచ్చేది దెబ్బలాడుకోటానికి కాదనేది అందరూ గుర్తించాలనే అంశాలపై కూలంకషంగా చర్చించి ప్రభుత్వానికి దిశ, దశా నిర్దేశించాల్సి ఉన్నందునే తాను సాధ్యమైనంతగా సభ్యులకు నచ్చచెబుతున్నానని, అప్పటికీ సాధ్యపడనప్పుడే తగిన చర్యలు తీసుకోవలసి వస్తోందని కోడెల వివరించారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ చట్ట ప్రకారం హైదరాబాద్‌లో పదేళ్లపాటు ఉండే అవకాశం ఉన్నప్పటికీ ప్రజల వద్దకెళ్లి పరిపాలన సాగించాలనే దృష్టితోనే నేడు సచివాలయం తరలించి, రేపు చట్టసభలను పూర్తిగా తరలించబోతున్నామని చెప్పారు. ఇందుకు ఎంత వ్యయమైనా వెనకాడబోమన్నారు. మంత్రులందరికీ సొంత ఇళ్లు ఉంటే అలవెన్స్, అద్దె ఇళ్లయితే అద్దెలను ప్రభుత్వం భరిస్తుందని, శాసనసభ సమావేశాలు జరిగే సమయంలో సభ్యులకు తాత్కాలిక వసతి చూపి ఎప్పటిలా టిఎ, డిఎలు అందజేస్తామన్నారు. అధికారులకు విల్లాస్‌లో బస చూపుతున్నామన్నారు. జిఎస్‌టి బిల్లును నవంబర్ 20లోపు ఆమోదించాలని కేంద్ర మంత్రి జైట్లీ కోరగా మరో నెల గడువు ఇవ్వాల్సిందిగా కోరామని వివరించారు.

చిత్రం.. విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి యనమల. పక్కన కోడెల, చక్రపాణి