రాష్ట్రీయం

సిసిఎల్‌ఎ భవనం కూలుస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 60 సంవత్సరాలు, నిజాం ప్రభుత్వ హయాంలో నలభై, యాభై ఏళ్లపాటు ఉపయోగపడ్డ హైదరాబాద్ (అబిడ్స్)లోని భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సిసిఎల్‌ఎ) భవనాన్ని ఏం చేస్తారన్న చర్చ ప్రారంభమైంది. రాష్ట్ర సచివాలయం తర్వాత అంతటి ప్రాధాన్యత ఈ భవనానికి ఉండటం వల్ల దీనిపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. హైదరాబాద్‌లోని హెరిటేజ్ భవనాల జాబితాలో ఈ భవనం పేరు నమోదైంది. సిసిఎల్‌ఎ పోస్టుకు, భవనానికి ప్రత్యేక చరిత్ర ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియామకం అయ్యే వారిని ప్రభుత్వం సిసిఎల్‌ఎగా నియమిస్తూ వస్తోంది. ఇప్పటి వరకు ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. సిసిఎల్‌ఎగా నియామకం అయ్యారంటే వారు తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తారన్న భావన అందరిలో ఉంది. ప్రభుత్వం కూడా ఇదే సాంప్రదాయం కొనసాగిస్తూ వస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించాలనుకుంటున్న సీనియర్ ఐఎఎస్ అధికారిని సిసిఎల్‌ఎగా నియమిస్తూ వస్తున్నారు. ఈ భవనానికి, పోస్టుకు అలాంటి ప్రత్యేకత ఉంది.
1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుండి ఇప్పటి దాకా ఇదే భవనాన్ని సిసిఎల్‌ఎ కార్యాలయంగా వినియోగిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత దీన్ని ఎపి సిసిఎల్‌ఎ భవనంగా వాడుతున్నారు. దీని వెనకన ఉన్న కొత్త భవనాన్ని రెండేళ్లుగా తెలంగాణ సిసిఎల్‌ఎ భవనంగా వాడుతున్నారు. ఎపి సిసిఎల్‌ఎ కార్యాలయం నెలరోజుల క్రితం విజయవాడ (అమరావతి) తరలిపోయింది. దీనికి అనుబంధంగా ఉన్న భవనం పాక్షికంగా గత వారం కూలిపోయింది. ఎపి సిసిఎల్‌ఎ కార్యాలయం తరలిపోవడంతో ఈ భవనం ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది. ప్రధాన భవనాన్ని నిజాం కాలంలో నజీం అత్యాద్ డిపార్ట్‌మెంట్ (న్యాయశాఖ) కోసం వాడారు. నిజాం హయాంలో జాగీర్ అడ్మినిస్ట్రేషన్, ఇనాం అడ్మినిస్ట్రేషన్, బోర్డ్ ఆఫ్ రెవెన్యూ విభాగాలు ఇదే భవనంలో ఉండేవని అధికారవర్గాలు వెల్లడించాయి. ఆనాటి రికార్డులు (ఉర్దూ) ఇప్పటికీ ఇదే భవనంలో దాదాపు నాలుగు గదుల్లో ఉన్నాయి. ఈ రికార్డులు ఏం చేయాలన్న ఆలోచన ఉన్నతస్థాయిలో జరుగుతోంది. జూబ్లీహాలు, అసెంబ్లీ హాలు, సిసిఎల్‌ఎ భవనం దాదాపు ఒకే పర్యాయం నిర్మించారని సంబంధిత అధికారి ఒకరు ఆంధ్రభూమి ప్రతినిధితో చెప్పారు. దాదాపు పదివేల చదరపుఅడుగుల్లో ఉన్న ఈ భవనాన్ని కూలుస్తారా? మరో కార్యాలయం కోసం వాడతారా? అన్నది ఇంకా తేల్చలేదు.

చిత్రాలు.. శిథిలావస్థకు చేరిన హైదరాబాద్‌లోని ఉమ్మడి రాష్ట్ర సిసిఎల్‌ఎ భవనం.
అనుబంధ భవనం కూలిన దృశ్యం.