రాష్ట్రీయం

ప్రభుత్వాన్ని కుదిపేసిన కాల్‌మనీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ నగరం నేరాలు ఈ ఏడాది తగ్గినా, సంవత్సరం చివరిలో క్లైమాక్స్ మాదిరి కాల్‌మనీ వ్యవహారం ప్రభుత్వాన్ని కుదిపేసింది. వడ్డీ వ్యాపారలనేవి నాటివి కావు... మురికివాడ నుంచి సినీ నిర్మాతలు... వ్యాపార ప్రముఖులు, రాజకీయ నేతల వరకు అన్ని స్థాయిల్లోనూ సాధారణంగా జరుగుతుండేవి. అయితే విజయవాడ కేంద్రంగా అక్షర ముక్క... నయాపైసాలేని బడాబాబులు సైతం రాజకీయ అండదండలతో కేవలం కాల్‌మనీ వ్యాపారంతో కోట్లాది రూపాయలు ఆర్జించటమేగాక తల్లి, అక్క, చెల్లి, కూతురు అనే వరుసలేకుండా బరితెగించి వారిపై లైంగిక వేధింపులు జరుపటమేగా వారిచే వ్యభిచారం చేయించే స్థితికి రావటంతో యావత్ సమాజం దిగ్భ్రాంతికి లోనవుతున్నది. ఆశ్చర్యకరం ఏమిటంతే ఈ రాకెట్‌లో అధికారపక్ష ప్రజాప్రతినిధులు, నేతలు భాగస్వాములుగా ఉన్నారనే ప్రచారానికి తగ్గట్లు సిగ్గు విడిచి న్యాయం చేయమంటూ పోలీసు స్టేషన్‌ల చుట్టూ తిరిగినా పట్టించుకోకపోవటంతో బాధితులు కొందరు నేరుగా పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్‌ను ఆశ్రయించటంతో... దీనికి తోడు ఆయన ఈ ప్రాంత వాసి కూడా కాకపోవటంతో నిర్భయంగా ఈ కాల్‌మనీ సెక్స్ రాకెట్ గుట్టును రట్టు చేశారు. ఈ వ్యవహారం ఎక్కడిదాక వెళ్లిందంటే పాలకుల గొంతు పట్టుకోవటమేగాదు అటు తిరిగి ఇటు తిరిగి ఆఖరికి శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ పై అవిశ్వాస తీర్మాన నోటీస్ జారీ వరకు వెళ్లింది. ఈ వ్యవహారంలో తొలుతగా బ్లాక్ మెయిల్, మోసం, మానభంగం వటి అభియోగాలతో ఏడుగురిపై కేసులు నమోదు కాగా వీరిలో యలమంచిలి రాము, దూడల రాజేష్, భవానీ శంకర్ అరెస్ట్ కాగా సస్పెన్షన్‌లో ఉన్న విద్యుత్ శాఖ డిఇ సత్యానందం, ఓ మాజీ శాసనసభ్యుడు సోదరుడు, మరో మాజీ శాసనసభ్యుని మేనమామ అయిన చెన్నుపాటి శ్రీను, పిండ్యాల శ్రీకాంత్, వెనిగళ్ల శ్రీకాంత్‌లు పరారీలో ఉండగా పోలీసులు వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆశ్చర్యకరం ఏమిటంటే తెలుగుదేశం ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌తోపాటు మరో నిందితుడు వెనిగళ్ల శ్రీకాంత్‌తోపాటు ఎప్పటిలా విదేశాలకు వెళ్లిన తెదే ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అయితే కేసు నమోదు తర్వాత తిరిగి వచ్చారు కాని ఆయన వెంట వెళ్లిన శ్రీకాంత్ ఆచూకీని మాత్రం ప్రభుత్వం తెలుసుకోలేకపోవటం చర్చనీయాశంగా మారింది. అసలు ఎక్కడ ఉన్నాడు.. భౌతికంగా ఉన్నాడా అనే అనుమానాలు రేగుతున్నాయి. రాష్ట్రాన్ని ఒక్క కుదుపు కుదిపిన ఇంతటి ఘోరమైన కేసులో అతని ఆచూకీ కూడా తెలుసుకోలేక పోయారంటే అసమర్ధ స్థితిలో ఈ ప్రభుత్వం ఉందా అనే అనుమానం కలుగుతున్నది. ఇదిలా ఉంటే ప్రభుత్వం అసలు కీలకమైన ఈ కేసును పక్కదోవ పట్టించేందుకు ఉన్నట్లు రాష్ట్ర వ్యాప్తంగా వడ్డీ వ్యాపారులపై దాడులు జరిపించింది. ఒక్క విజయవాడలోనే ఇప్పటికీ 580 ఫిర్యాదులు లిఖితపూర్వకంగా అందాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఫిర్యాదులు వేల సంఖ్యలో అందుతున్నాయి. థర్మ వడ్డీతో వ్యాపారం చేసే వారు లబోదిబోమంటున్నారు. అలాగే సందట్లో సడేమియాలా ఎగవసేందుకు కూడా కొందరు సిద్ధమవుతున్నారు. అసలు సిసలైన బాధితులు బాహాటంగా బోరున విలపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో వందలు వేల సంఖ్యలో ఖాళీ ప్రాంసరీ నోట్లు, చెక్ పుస్తకాలు, అగ్రిమెంట్లు, దస్తావేజులు, తనఖా కాగితాలు మురుగుకాల్వల్లో దొరికాయని కొందరు, తగులబడి కన్పించాయని కొందరు పోలీసులు ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి ఏ ఒక్కరైనా కీలకమైన పత్రాలు దాచి పెట్టుకోలేని స్థితిలో ఉంటారా అనేది అనుమానం కల్గుతున్నది. అంటే ప్రభుత్వమే ఈ విధమైన ప్రచారం సాగిస్తున్నదాయనే విమర్శలు కూడా చెలరేగుతున్నాయి. ఇక ధైర్యంగా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదులు అందించిన బాధితులపై వడ్డీ వ్యాపారుల నుంచి వేధింపులు, బెదిరింపులు కూడా ప్రారంభమవుతున్నాయి. అధర్మ వడ్డీలో అప్పు తీసుకున్న బాధితులెవరూ నయాపైసా చెల్లించవద్దంటూ అభయం ఇస్తున్న సిఎం చంద్రబాబు వీరందరికీ ఎంతకాలం ఏమేర భద్రత కల్పిస్తారో వేచిచూడాల్సిందే. విదేశాల్లో మూలుగుతున్న వేలకోట్ల రూపాయల నల్ల ధనాన్ని కేంద్ర ప్రభుత్వం వెలికితీయలేకపోయినా అంతటి రెట్టింపు స్థాయిలో విచ్చలవిడిగా సాగుతున్న ఈ కాల్‌మనీ వ్యాపారాన్ని నివారించడమనేది ఓ సవాల్ వంటిది.

-నిమ్మరాజు చలపతిరావు