రాష్ట్రీయం

పల్లెల్లో నీలి విప్లవం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిలవార్‌పూర్, అక్టోబర్ 3: మత్స్యకారుల స్వయం సమృద్ధిని దృష్టిలో పెట్టుకుని రాష్టవ్య్రాప్తంగా చెరువులు, ప్రాజెక్టుల్లో ఉచితంగా 35 కోట్ల చేప పిల్లలు విడుదల చేస్తుందని పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. స్థానిక సాంగ్వీలోని శ్రీరాంసాగర్ కాల్వలో మంత్రులు అల్లోల, జోగు రామన్నతో కలిసి సోమవారం చేప పిల్లలు వదిలారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సాంగ్వీలో రూ.3 కోట్ల విలువచేసే చేప పిల్లలు వదిలామన్నారు. సమైక్యాంధ్ర సమయంలో చేప పిల్లలు రాజమండ్రి, కాకినాడ నుంచి దిగుమతి జరిగేదని, ప్రస్తుతం సీడ్ రాష్ట్రంలోనే ఉత్పత్తిచేసేలా కేంద్రాలు నెలకొల్పేందుకు కృషి చేస్తున్నామన్నారు.
మంత్రి అల్లోల మాట్లాడుతూ అర్హులైన మత్స్యకారులకు ఇళ్లు కేటాయిస్తామన్నారు. చేప పిల్లల పెంపకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మిషన్ కాకతీయలో చెరువుల పునరుద్ధరణ కారణంగా ఇటీవల కురిసిన వర్షాలతో చెరువులన్నీ జలకళ సంతరించుకున్నాయన్నారు. మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ హరితహారానికి సహకరిస్తున్న అధికారులు, ప్రజలను అభినందించారు. ఇదే స్ఫూర్తితో నాటిన మొక్కలను సంరక్షించాలని పిలుపునిచ్చారు.

చిత్రం.. సాంగ్వీలో చేప పిల్లలు వదులుతున్న మంత్రులు తలసాని, అల్లోల, జోగు రామన్న