రాష్ట్రీయం

30 కాదు 31

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 3: ముసాయిదాలో ప్రకటించిన 17 కొత్త జిల్లాలతోపాటు జనగామ, గద్వాల, సిరిసిల్ల, ఆసిఫాబాద్ జిల్లాల ఏర్పాటుకు ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులపై అధ్యయనం చేసి తుది నిర్ణయం తీసుకుంటామని సిఎం కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీతో అధ్యయనం చేయించి రెండు మూడు రోజుల్లో నివేదిక తెప్పించుకున్న తర్వాత తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నట్టు సిఎం వెల్లడించారు. దసరా రోజున ప్రారంభమయ్యే కొత్త జిల్లాలతో ప్రజలంతా సంతోషంగా సంబురాలు చేసుకుంటుంటే జనగామ, సిరిసిల్ల, గద్వాల ప్రజలు బాధపడటం మంచిదికాదని వ్యాఖ్యానించారు. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన తెరాస ప్రజాప్రతినిధులతో సోమవారం జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాల పునర్విభజనపై సిఎం కెసిఆర్ సమాలోచనలు జరిపారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై రెండు రోజులుగా పార్టీ ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమాలోచనల్లో ఏకాభిప్రాయం కుదరడంతో ముసాయిదాలో ప్రకటించిన 17 జిల్లాలతోపాటు అదనంగా మరో నాలుగు జిల్లాల ఏర్పాటుకు సిఎం సానుకూలంగా ఉండటంతో పాత, కొత్త జిల్లాలు కలిపి వీటి సంఖ్య 31కి చేరుకోనుంది. రెండోరోజు సోమవారం జరిగిన సమాలోచనల్లో ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ జిల్లా ఏర్పాటు చేయాలన్ని కొత్త ప్రతిపాదన తెరపైకి రాగా సిఎం సానుకూలంగా స్పందించారు. దీని ప్రకారం అత్యధికంగా వరంగల్ జిల్లాలో 5 జిల్లాలు ఏర్పాటుకానుండగా, కరీంనగర్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో నాలుగేసి జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో మూడేసి, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో రెండేసి జిల్లాల చొప్పున కొత్త జిల్లాలు ఏర్పాటుకానున్నాయి. హైదరాబాద్ జిల్లా మాత్రం యథాతథంగా కొనసాగనుంది. ఇలావుండగా
ముసాయిదాలో ప్రతిపాదించని జనగామ, సిరిసిల్ల, గద్వాల జిల్లాల్లో ఏయే మండలాలను కలిపి కొత్త జిల్లాల ఏర్పాటుకు అవకాశం ఉందో పరిశీలించాలని అధికారులను ఆదేశించినట్టు కెసిఆర్ వెల్లడించారు. కొత్తగూడెం జిల్లాకు భద్రాద్రిగా, సిరిసిల్ల జిల్లాకు రాజన్న పేరు పెట్టాలనే ప్రతిపాదననూ పరిశీలించాలని సిఎం అధికారులను ఆదేశించారు. వికారాబాద్ కేంద్రంగా ఏర్పాడే జిల్లాకు అదే పేరు కొనసాగించాలని సిఎం సూచించారు. దీనికి అనంతగిరి జిల్లాగా పేరు పెట్టాలన్న ప్రతిపాదనను ముఖ్యమంత్రి తోసిపుచ్చారు. అయితే ముసాయిదాలో ప్రకటించిన హన్మకొండ జిల్లా స్థానంలో వరంగల్ రూరల్ జిల్లా ఏర్పాటు చేయబోతున్నట్టు సిఎం ప్రకటించారు. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ రెండు జిల్లాలకు వరంగల్ నగరమే కేంద్రంగా ఉంటుందన్నారు. హుజురాబాద్, జమ్మికుంట మండలాలను కరీంనగర్ జిల్లాలోనే కొనసాగించాలని, కమలాపూర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాలను వరంగల్ అర్బన్ జిల్లాలో, హుస్నాబాద్, కోహెడా మండలాలను సిద్ధిపేట జిల్లాలో కలపాలని సిఎం ప్రతిపాదించారు. మంథని రెవిన్యూ డివిజన్‌ను యధావిధిగా కొనసాగించాలని, పెద్దపల్లి నగర పంచాయతీని మున్సిపాలిటీగా మార్చాలని, ఖమ్మం జిల్లాలోని వాజేడు, వెంకటాపురం మండలాలను భూపాలపల్లి జిల్లాలో కలుపాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. వరంగల్ జిల్లాలోని చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి మండలాలను సిద్ధిపేట జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో కొత్తగా రుద్రంగి మండలం ఏర్పాటు చేయడంతోపాటు ఖమ్మం జిల్లాలో కొత్తగా ఆళ్లపల్లి, కరకగూడెం, చుంచుపల్లి, లక్ష్మిందేవిపల్లి, సుజాతనగర్, అన్నపురెడ్డి ఆరు మండలాలు, ఆదిలాబాద్ జిల్లాలో గాదిగూడ, సిరికొండ మండలాలు ఏర్పాటు చేయాలని సిఎం నిర్ణయించారు. వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్‌ను రెవిన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసి దానిని ప్రతిపాదిత జనగామ జిల్లాలో కలపాలని నిర్ణయించారు. భూపాలపల్లి జిల్లాలోని ములుగుకు ఉన్న ప్రాధాన్యత, గిరిజన జనాభాను దృష్టిలో పెట్టుకుని ఆ ప్రాంతాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవావడానికి ప్రత్యేక నిధులు విడుదల చేయనున్నట్టు సిఎం నిర్ణయించారు.

చిత్రం.. ఉత్తర తెలంగాణ జిల్లాల తెరాస ప్రజాప్రతినిధులతో క్యాంపు కార్యాలయంలో
సోమవారం కొత్త జిల్లాలపై మంతనాలు సాగిస్తున్న సిఎం కె చంద్రశేఖర్ రావు