రాష్ట్రీయం

రమ్య పేరిట చట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/హయత్‌నగర్, అక్టోబర్ 4: రెండు నెలల కింద ట నలుగురు యువకులు పీకల దాకా మద్యం సేవించి, కారు నడిపి రమ్య అనే పదేళ్ల బాలికను బలిగొన్న సంఘటన మళ్లీ తెరపైకి వచ్చింది. అదే తరహాలో హయత్‌నగర్ సమీపాన ప్రమా దం జరగడం, ఈ దుర్ఘటనలో సంజన అనే ఐదేళ్ల బాలికకు బ్రెయిన్‌డెడ్ కాగా ఆమె తల్లి శ్రీదేవి పరిస్థితి విషమంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై రమ్య తల్లిదండ్రులు రాధిక, వెంకట రమణ స్పందిస్తూ తమ కుమార్తె రమ్యలాగ ఇంకెంతమంది చిన్నారులు బలికావాలని ప్రశ్నించారు. మంగళవారం వారు మీడియాతో మాట్లాడుతూ రమ్య మృతి కేసులో నిందితులకు బెయిల్ రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారి రమ్య ప్రమాదానికి గురైన తరహాలోనే సంజన కూడా తీవ్రంగా గాయపడటం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు. రమ్య పేరిట డ్రంక్ అండ్ డ్రైవ్ చట్టం తేవాలని, ఈ కేసులో ఆరుగురు దోషులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా హయత్‌నగర్ సమీపంలో సోమవారం జరిగిన చిన్నారి సంజన ప్రమాద ఘటన కేసులో మరో ఇద్దరిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ ఘటనలో ఆదివారం రాత్రి కారు డ్రైవర్ వెంకటేశ్ ఎల్‌బినగర్ ఎసిపి ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే. కాగా మంగళవారం శ్రీనివాస్, యాదిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కోమాలో ఉన్న సంజనకు వైద్యులు వెంటిలేటర్ ద్వారా చికిత్స అందిస్తున్నారు. చిన్నారి సంజన పరిస్థితి చూసిన ఆమె తాత నరేందర్‌కు మంగళవారం గుండెపోటు వచ్చింది. తన కుమార్తె శ్రీదేవి, మనువరాలు సంజన తీవ్రంగా గాయపడడంతో మనస్తాపానికి గురైన నరేందర్ గుండెపోటుకు గురయ్యారని బంధువులు తెలిపారు. ఆయనను వెంటనే కామినేని ఆసుపత్రికి తరలించారు. నరేందర్‌కు వైద్య సేవలందుతున్నాయని, ఆయన పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరంలేదని వైద్యులు తెలిపారు.
అసలేం జరిగిందంటే..
హయత్‌నగర్ మండల పరిధిలోని పెద్దఅంబర్‌పేట్ నగర పంచాయతి కల్వంచకు చెందిన వెంకటరమణ (38) సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన యాదిరెడ్డి, శ్రీనివాస్‌లు కొత్తపేట్‌లో ఎలక్ట్రికల్ షాపు నిర్వహిస్తుంటారు. అయితే ఓ ప్లాట్ కొనేందుకు ముగ్గురు (ఏపి29ఎన్5799) కారులో హయత్‌నగర్ మండలం బాటసింగారం గ్రామ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. కాగా ఆదివారం గాంధీ జయంతి కావడంతో ముందుగా కొనుగోలు చేసుకున్న మద్యం తీసుకెళ్లిన వారు అక్కడే తాగారు. తిరిగి కారులో వస్తుండగా మద్యం తాగుతూ వచ్చినట్లు తెలిసింది. మద్యం మత్తులో వేగంగా వచ్చిన వీరు రోడ్డు దాటుతున్న శ్రీదేవి, సంజనలను ఢీకొట్టారు. కారును ఆపకుండా పారిపోతున్న వారిని స్థానికులు వెంబడించి కారు తాళాలు లాక్కొన్నారు. ఈ హడావిడిలో కారులో ఉన్న ముగ్గురు అక్కడి నుండి పారిపోయారు. నిందితుల్లో ఒకరైన వెంకటరమణ సోమవారం పోలీసుల ముందు లొంగిపోగా మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముగ్గురినీ విచారిస్తున్నట్లు హయత్‌నగర్ పోలీసులు తెలిపారు.